‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌ను పొరపాటున లీక్ చేసిన ఐరిష్ నటి..

యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ విషయంలో రాజమౌళి చాలా గోప్యత పాటిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ ఏదో ఒక రూపంలో లీక్స్ మాత్రం అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ లీక్ అవడం గమనార్హం.

‘ఆర్ఆర్ఆర్‘ మూవీ రిలీజ్ డేట్‌పై ఎన్నో మీమ్స్.. సెటైర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైనప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మాత్రం కనీసం ఊహాగానాలకు కూడా రాజమౌళి అందనీయలేదు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తున్న ఐరిష్ నటి అలిసన్ డూడీ పొరపాటున చిత్ర విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందట. ఇది కాస్తా వైరల్ అవడంతో అమ్మడు తన పోస్టును డిలీట్ చేసేసింది. ‘ఆర్ఆర్ఆర్‘ రిలీజ్ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నెటిజన్లు ఈ అవకాశాన్ని వదిలేస్తారా? డూడీ డిలీట్ చేసే లోపే వైరల్ చేసేశారు.

ఇంతకీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా? డూడీ పోస్టు ప్రకారం 2021, అక్టోబర్ 8. ఈ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాబోతోందంటూ డూడీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టిందట. దీనిని చూసిన నెటిజన్లు వెంటనే వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. కొద్దిసేపటికే డూడీ తన పోస్టును డిలీట్ చేసింది. అయితే రాజమౌళి ఆ తేదీనే ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేస్తారో లేదంటే మారుస్తారో వేచి చూడాలి. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More News

పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ విజ్ఞప్తిని తోసి పుచ్చి ఎన్నికల కమిషన్ తొలి విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

జో బైడెన్ తొలి ప్రసంగం వెనుక తెలుగోడి ప్రతిభ..

దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10- 30 గంటలకు..

కోల్గేట్ సంస్థకు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం..

కోల్గేట్ సంస్థకు వినియోగదారుల ఫోరం మొత్తంగా రూ.15 వేల జరిమానా విధించింది.

వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఫోటోలకు ఫోజులు.. అడ్డంగా బుక్కయ్యారు..

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొందరి అతి తెలివి కారణంగా అభాసు పాలవుతోంది.

ఫొటో షేర్ చేసి డిలీట్ చేసిన సామ్..

సమంత అక్కినేని ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.