విక్రమ్ టైటిల్ ఓకే అయ్యింది

  • IndiaGlitz, [Saturday,May 21 2016]

చియాన్ విక్రమ్ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇరుముగన్. ఈ చిత్రంలో విక్రమ్ రా ఏజెంట్ గా కనపడుతున్నాడు. అంతే కాకుండా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే విక్రమ్ చేస్తున్న ఒక పాత్ర హిజ్రా అని సమాచారం.

ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ఇంకొక్కడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్వరలోనే అధికారక సమాచారం రానుంది. ఈ సినిమాను జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More News

నిఖిల్ సినిమా కొత్త టైటిల్ ఇదే...

శంక‌రాభ‌ర‌ణం సినిమా త‌ర్వాత నిఖిల్ హీరోగా టైగ‌ర్ ఫేమ్ ఆనంద్ ద‌ర్శ‌కత్వంలో  ఓ చిత్రం రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు.

త్రిష నాయ‌కి విడుద‌ల తేదీ ఖ‌రారు..

త్రిష తొలిసారి న‌టించిన హ‌ర్ర‌ర్ మూవీ నాయ‌కి. ఈ చిత్రాన్ని గోవి ద‌ర్శ‌క‌త్వంలో గిరిధ‌ర్ నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష కు జంట‌గా గ‌ణేష్ వెంక‌ట్రామ్ న‌టించారు.

జ‌న‌తా గ్యారేజ్ క్యాప్ష‌న్ మారింది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం  మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై రూపొందుతుంది.

బ్ర‌హ్మోత్స‌వం చిత్రం చాలా చాలా బాగుంది - సూప‌ర్ స్టార్ కృష్ణ‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా, కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్ గా పి.వి.పి సినిమా - ఎం.బి. ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో పెర‌ల్ వి. పొట్లూరి, ప‌ర‌మ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన యూత్ ఫుల్ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ బ్ర‌హ్మోత్స‌వం.

నాగఅన్వేష్ కి జోడిగా హెబ్బాపటేల్

వినవయ్యా రామయ్య ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమా పనులు శరవేగంగా జరుతున్నాయి. సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మాతగా రాజమౌళి శిష్యుడు 'బాహుబలి' పళని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.