Sai Pallavi : రౌడీ బేబి సినిమాలపై నో అప్‌డేట్...సాయిపల్లవి సంచలన నిర్ణయం తీసుకున్నారా...?

  • IndiaGlitz, [Thursday,November 24 2022]

ఇప్పటి రోజుల్లో హీరోయిన్లంటే స్కిన్ షో, హాట్ ఫోటో షూట్‌లు, అందాల అరబోతలు, లిప్ లాక్స్‌కే పరిమితమవుతున్నారు. కాని కొందరు మాత్రం కోట్లు ఇచ్చినా నటనకు, కథకే తమ తొలి ఓటని తేల్చిచెబుతూ.. స్టార్ హీరోయిన్లుగా దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో వుంటారు సాయిపల్లవి. ఫిదా సినిమాతో తెలుగు వారిని కట్టిపడేసిన సాయిపల్లవి... తర్వాత తాను అందాల అరబోతకు దూరమని చెబుతూ, సెలక్టెడ్ మూవీస్ మాత్రమే చేస్తోంది. అద్భుతమైన నటిగా, లేడీ పవర్‌స్టార్‌గా అభిమానుల చేత ప్రశంసలు పొందుతోంది.

గార్గి తర్వాత ఒక్క సినిమా కూడా ప్రకటించని సాయిపల్లవి:

అయితే ఈ అమ్మడు కొత్త ఏ సినిమాకూ కమిట్ అయినట్లుగా ఎలాంటి న్యూస్ వినిపించడం లేదు. చివరిగా సాయిపల్లవి నటించిన సినిమా గార్గి. లేడీ ఓరియెంటెడ్‌ జోనర్‌లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇలాంటి హిట్ తర్వాత కూడా సాయి పల్లవి తన కొత్త సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

కోయంబత్తూరులో సిస్టర్‌తో కలిసి ఆసుపత్రి నిర్మాణం:

కాగా.. చాలా మంది స్టార్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పుకుంటూ వుంటారు. అయితే సాయిపల్లవి విషయంలో దీనికి రివర్స్‌లో జరిగింది. ఆమె జార్జియాలో వైద్య విద్యను అభ్యసించారు. మీడియాలో వస్తున్న వార్తలను బట్టి సాయిపల్లవి తన స్వస్థలం కోయంబత్తూరులో సొంతంగా ఓ హాస్పిటల్‌ను నిర్మిస్తోన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇకపై సినిమాలకు గుడ్‌బై చెప్పేసి డాక్టర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారట. ఈ ఆసుపత్రి కార్యకలాపాలను సాయిపల్లవితో పాటు ఆమె సోదరి పూజా కలిసి నిర్వహిస్తారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి నిర్మాణం, ప్రాక్టీస్ మొదలుపెట్టే ఉద్దేశంతోనే సాయిపల్లవి సినిమాలకు దూరంగా వున్నారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే వెండి తెరకు అద్భుతమైన నటి దూరమైనట్లే. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More News

MLAs Poaching Case : రామచంద్ర భారతిపై మరో కేసు.. కర్ణాటక అడ్రస్‌తో నకిలీ పాస్‌పోర్ట్, ఆ ఫోన్‌లో కీలక విషయాలు

మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.

OTT Releases : ఓటీటీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. ఐదు చిత్రాలు స్ట్రీమింగ్, ఆ మూవీ పైనే చూపు

కరోనా తర్వాత వ్యవస్థలో చెప్పలేనన్ని మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం కొందరికే పరిమితమని అనుకుంటున్న వేళ..

Gaalodu: గాలోడు విజయం ప్రతీ ఒక్కరిది.. దర్శక, నిర్మాత రాజశేఖర్ రెడ్డి

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టించిన ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`.

Custody: నాగ చైతన్య NC 22 టైటిల్ 'కస్టడీ'... ఫస్ట్ లుక్ విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం రెండు నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది.

Marina Abraham : బిగ్‌బాస్‌లో 11 వారాల పాటు... మరి మెరీనాకు ఎంత ముట్టిందంటే..?

బిగ్‌బాస్ తెలుగు 6 చివరి అంకానికి చేరుకుంది. ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతూ వుండటంతో షో ఇంట్రెస్టింగ్‌గా సాగుతోంది.