క్రేజీ కాంబినేష‌న్.. నిజ‌మెంత‌?

కొన్ని కాంబినేష‌న్స్ పేర్లు విన‌గానే అంద‌రిలో సినిమా ఎలా ఉంటుంది? , ఎప్పుడు ఉంటుంది?, అస‌లు ఈ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందా? అనే చాలా సందేహాలు వ‌స్తాయి. అలా ఓ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నుంద‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇంత‌కూ ఆ కాంబినేష‌న్ ఎవ‌రిదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే క‌లిసి సినిమా చేయ‌బోతున్నార‌ని టాక్‌.

వివ‌రాల్లోకెళ్తే బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీ పుష్ప‌లో న‌టించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రో ప‌క్క కొర‌టాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌పై మ‌రింత క్లారిటీ రానుంద‌ట‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అధినేత అల్లు అర‌వింద్ ఆ దిశ‌గా పావులు క‌దువుతున్నాడ‌ని టాక్‌. ఈ సినిమా కోసం కొర‌టాల‌కు భారీ ప్యాకేజ్ ముడుతుంద‌ని అంటున్నారు. బ‌న్నీ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొర‌టాల త‌న‌దైన స్టైల్లో మెసేజ్ ఉండే క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెరెక్కిస్తాడ‌ని అంటున్నారు. అయితే వ‌చ్చే ద్వితీయార్థంలోనే ఈ కాంబినేష‌న్‌లో సినిమాపై మ‌రింత స‌మాచారం ఉండ‌నుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే బ‌న్నీ అభిమానుల‌కు పండగేన‌ని చెప్పొచ్చు.