దసరా రేసులో బన్నీ..?

  • IndiaGlitz, [Wednesday,March 04 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. మార్చి ద్వితీయార్థం నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి బ‌న్నీ, సుకుమార్‌, నిర్మాత‌లు యోచిస్తున్నార‌ట‌. ద‌స‌రా సంద‌ర్భంగా ప్ర‌భాస్ 20వ సినిమా మాత్ర‌మే విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాది సంక్రాంతి అయినా.. స‌మ్మ‌ర్ అయినా ఇప్ప‌టికే చిరంజీవి, మ‌హేశ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు రిజ‌ర్వ్ చేసేసుకున్నాయి. ఈ త‌రుణంలో ద‌స‌రా అయితే బావుంటుంద‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. సుకుమార్ కూడా ద‌స‌రాకే సినిమాను విడుద‌ల చేసేలా ప్ర‌ణాళిక‌లు వేసి షూటింగ్‌ను శ‌ర‌వేగంగా ముగించాల‌ని అనుకుంటున్నాడ‌ని టాక్‌.

ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌ర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్నతొలి షెడ్యూల్ 60 రోజుల పాటు కేర‌ళ‌లో జ‌ర‌గ‌నుంది. శేషాచ‌లం అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సుకుమార్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమా కోసం బ‌న్నీ చిత్తూరు జిల్లా యాస‌ను నేర్చుకున్నాడ‌ట‌.

More News

బ‌న్నీ, విజ‌య్  ఏం తింటారో తెలుసుకోవాలి:  హృతిక్ రోష‌న్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే హై ఎనర్జీ. ఆయ‌న డాన్సుల‌కు ప్ర‌త్యేకమైన అభిమానులుంటారు. ఎంద‌రో ఆయ‌న డాన్స్ సూప‌ర్బ్ అంటూ అభినందించారు.

త‌మ‌న్నా గురించి స‌మంత ట్వీట్‌

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాను అభినందిస్తూ చెన్నై సొగ‌స‌రి స‌మంత అక్కినేని ట్వీట్ చేసింది. ఇంత‌కూ త‌మ‌న్నాను స‌మంత ఎందుకు అభినందించింది అని చూస్తే..

'కనులు కనులను దోచాయంటే' చూసిన వాళ్లందరికీ నచ్చింది - దుల్కర్ సల్మాన్

దుల్కర్‌ సల్మాన్‌, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కణ్ణుమ్‌ కణ్ణుమ్‌ కుళ్లయడిత్తా’.

ప్రభాస్‌పై కరోనా ఎఫెక్ట్..!

‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే దాదాపు 65 దేశాల్లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల.. చివరికిలా..!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.