బెల్లంకొండ శ్రీనివాస్‌కి హీరోయిన్ దొరికిందా?

  • IndiaGlitz, [Monday,March 01 2021]

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. తెలుగు సినిమా పాన్ ఇండియాగా మారిన త‌రుణంలో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాల‌నుకుంటున్నాడు. అందుకు త‌గ్గ‌ట్లు ‘ఛ‌త్ర‌ప‌తి’ సినిమా హిందీ రీమేక్‌లో న‌టించ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘అల్లుడు శీను’ సినిమాతో ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌.. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు. శ్రీనివాస్‌కే కాదు వినాయ‌క్‌కు కూడా ఇదే బాలీవుడ్ డెబ్యూ మూవీ. ద‌ర్శ‌కధీరుడు తెర‌కెక్కించిన ‘ఛ‌త్ర‌ప‌తి’ సినిమాను వినాయ‌క్ ఎలా ప్రెజంట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై జ‌యంతి లాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఈ సినిమా ప‌రంగా ఓ స‌మ‌స్య చాలా రోజులు వేధించింది... ఆ స‌మ‌స్య ఏదో కాదు.. స‌రైన హీరోయిన్ దొర‌క్క‌పోవ‌డ‌మే. ద‌ర్శ‌క నిర్మాత‌లు జాన్వీక‌పూర్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, కియార అద్వాని స‌హా చాలా మంది స్టార్ హీరోయిన్స్‌ను సంప్ర‌దించే ప్ర‌య‌త్నాలు చేశారు , కానీ ఎవ‌రూ ఒప్పుకోలేదు. ఈ త‌రుణంలో దిశా ప‌టాని ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్న‌ట్లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త‌ర్వ‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని అంటున్నారు.

More News

మిర్చి హీరోయిన్‌.. త‌ల్లి కాబోతుంది

ప్ర‌భాస్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం  ‘మిర్చి’. రైట‌ర్ కొర‌టాల శివ ఈ సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారాడు.

‘రొమాంటిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఆకాశ్‌పూరి హీరోగా రూపొందుతోన్న ‘రొమాంటిక్’ చిత్రానికి పూరీ జ‌గ‌న్నాథ్, చార్మి నిర్మాత‌లుగా వ్య‌వ‌హరిస్తున్నారు.

కోవిడ్ టీకాను తీసుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఈ రోజు నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి,

సంద‌డిగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్లే బ్యాక్' ప్రి-రిలీజ్ ఈవెంట్..

'100%లవ్', '1 నేనొక్కడినే' వంటి హిట్ చిత్రాలకు కథ-స్క్రీన్ ప్లే అందించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ హరిప్రసాద్ జక్కా రూపొందించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్లే బ్యాక్'.

యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ‘సారంగదరియా’

ఒక జానపద గీతానికి ఉండే క్రేజే వేరు.. ఇక ఆ జానపద గీతానికి సాయిపల్లవి ఫుల్ ఎనర్జీతో.. గ్రేస్‌తో డ్యాన్స్‌ను ఇరగదీస్తే అబ్బో ఆ పాటను చూడటానికి రెండు కళ్లూ చాలవు.