బోయపాటి రీమేక్ చేయనున్నాడా?

  • IndiaGlitz, [Sunday,December 31 2017]

తొలి చిత్రం భ‌ద్ర మొద‌లుకుని తుల‌సి, సింహా, ద‌మ్ము, లెజెండ్‌, స‌రైనోడు, జ‌య‌జాన‌కి నాయ‌క వ‌ర‌కు స్ట్ర‌యిట్ చిత్రాల‌తోనే ప‌ల‌క‌రించారు స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను. అయితే ఎనిమిదో చిత్రంగా రానున్న సినిమా కోసం బోయ‌పాటి రీమేక్ స‌బ్జెక్ట్ ని ఎంచుకున్నారంటూ టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

జ‌న‌వ‌రి 19 నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమా విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా హిందీలో విజ‌యం సాధించిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ ప‌యో చిత్రం ఆధారంగా తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. 2015లో వ‌చ్చిన ఈ చిత్రంలో స‌ల్మాన్ ఖాన్‌, సోన‌మ్ క‌పూర్ జంట‌గా న‌టించారు. ఇందులో స‌ల్మాన్ ద్విపాత్రాభిన‌యం చేశారు. మ‌రో విష‌య‌మేమిటంటే.. ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ ప‌యో చిత్రం తెలుగు అనువాదం ప్రేమ‌లీల కోసం స‌ల్మాన్ పాత్ర‌కి చ‌ర‌ణ్ డ‌బ్బింగ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. మ‌రి.. ఈ రీమేక్ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.