close
Choose your channels

దిల్‌‌రాజు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా!?

Tuesday, October 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిల్‌‌రాజు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా!?

టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా..? ఆయనకు బీజేపీ గాలం వేసి మరీ పార్టీలోకి చేర్చుకుంటోందా..? ఓ కేంద్ర మంత్రి.. దిల్‌రాజుతో భేటీ అయ్యి దగ్గరుండి మరీ బీజేపీలో చేర్చడానికి వ్యూహాలు రచించారా..?.. అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమనిపిస్తున్నాయి.

ఇదీ బీజేపీ ప్లాన్!?

తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలకనేతలను పార్టీలో చేర్చుకునే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా జనబలం.. జనాల్లో మంచి పేరున్న, వ్యాపారవేత్తలకు కూడా గాలం వేస్తూ వారికి కాషాయ కండువాలు కప్పేస్తున్నారు. ఈ క్రమంలో ఓ కేంద్ర మంత్రి.. టాలీవుడ్‌లో బడా నిర్మాతగా పేరుగాంచిన దిల్‌రాజును పార్టీలోకి ఆహ్వానించడం.. ఆయన వెనువెంటనే భేటీ కావడం.. ఒక్కరోజు గ్యాప్‌లోనే ఢిల్లీ వెళ్లడం.. ప్రధాని మోదీని కలవడం ఇవన్నీ చకచకా జరిపోయాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కేంద్ర మంత్రి అమిత్ షా లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో దిల్ రాజు షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని సమాచారం.

రూమర్స్ అని కొట్టి పారేయలేం!

అయితే ఇవన్నీ రూమర్సే అని కొట్టిపారేయడానికి లేదు.. ఎందుకంటే ఇటీవల గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ.. సినీ సెలబ్రిటీలకు విందు ఇచ్చిన విషయం విదితమే. ఈ విందుకు బాలీవుడ్ తారలు మాత్రమే హాజరవ్వగా సౌత్ నుంచి ఎవరికీ పిలుపు రాలేదు.. పెద్దలు కూడా హాజరుకాలేదు. అయితే ఒకే ఒక్క దిల్ రాజు మాత్రమే ఈ విందులో ప్రత్యక్షమయ్యారు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది.. తాజాగా వస్తున్న పుకార్లకు బలం చేకూరుస్తోంది. ఈ భేటీ తర్వాత ‘మిమ్మల్ని కలవడం అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల గురించి మీతో చర్చించడం చాలా సంతోషం’ అని మోదీని ఆకాశానికెత్తేయడం కూడా ఇందులో భాగమేనని నెటిజన్లు అంటున్నారు.

ఎప్పట్నుంచో ప్రయత్నాలు.. ఇప్పుడిలా!?

వాస్తవానికి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దిల్‌రాజు.. రాజకీయాల్లో కూడా రాణించాలని ఎన్నోరోజులుగా వేచి చూస్తున్నారు. అయితే అవకాశం రాలేదు కానీ.. 2014 ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలని భావించారట. అదికాస్త వర్కవుట్ కాకపోవడం.. 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ప్రయత్నాలు చేయగా ఫలించలేదట. అందుకే ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని ఓ కేంద్ర మంత్రి సలహా ఇవ్వడంతో బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇవీ దిల్‌రాజుకు ఇచ్చిన హామీలు!

కాగా.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటే సముచిత స్థానం కల్పించడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ టికెట్ కానీ ఇస్తామని అధిష్టానం తాను హామీ ఇప్పిస్తానని ఆ కేంద్ర మంత్రి దిల్‌రాజ్‌కు అభయమిచ్చారట. అంతేకాదు.. రేపు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని కూడా అధిష్టానంతో హామీ ఇప్పిస్తానని ఈ టాప్ నిర్మాతకు హామీ ఇచ్చారట. ఇవన్నీ విని పొంగిపోయిన దిల్‌రాజు ఓకే అన్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో..? అసలు దిల్‌రాజ్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారా..? లేకుంటే అబ్బే అదేం లేదని తనకున్న నిర్మాణ రంగంలోనే మరింత రాణిస్తారా..? అనేది తెలియాలంటే వెయిట్ అండ్ సీ..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.