దిల్‌రాజు హ్యాపీగా లేడా?

  • IndiaGlitz, [Saturday,December 28 2019]

ఒక‌ప్పుడు స్టార్ హీరోలంద‌రినీ డైరెక్ట‌ర్ చేసి స్టార్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు వి.వి.వినాయ‌క్‌. ఈయ‌న ఇప్పుడు 'శీన‌య్య' అనే చిత్రంతో ద‌ర్శ‌కుడి నుండి హీరోగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. కాంటెప‌ర‌రీ ఇష్యూను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ట‌. అయితే తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రం ఔట్‌పుట్‌పై నిర్మాత దిల్‌రాజు హ్యాపీగా లేడ‌ట‌. దీంతో రీషూట్ చేయ‌మ‌ని డైరెక్ట‌ర్‌ని ఆదేశించాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సమాచారం ప్రకారం..కాంటెంప‌ర‌రీ స‌బ్జెక్ట్‌తోనే సినిమా ఉంటుంద‌ట‌. దేశాన్ని పట్టి కుదిపేస్తున్న అత్యాచారాలనే కథాంశంగా తీసుకున్నారట. దిశ, ఉన్నావ్ హత్యాచార ఘటనలు దేశమంతా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే దిశ ఘటనలో నిందితులు ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. నిందితుల హతం పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రాల అధినేతలే హైదరాబాద్ పోలీసులపై అభినందనలు కురిపించారు. ఇక సినీ ఇండస్ట్రీ అయితే పోలీసులను హీరోలుగా పోలుస్తూ ట్వీట్స్ చేసింది. దిశ హత్యలో నిందితుల ఎన్‌కౌంటర్‌తో ప్రతీకారం తీర్చుకున్నట్టుగా అందరూ భావిస్తున్నారు.

ఇలాంటి ప్రతీకార కథాంశంతోనే శీనయ్య కూడా రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఓ ఘటనతో తీవ్ర వ్యథకు లోనైన శీనయ్య.. ఆ ఘటనకు పాల్పడిన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడనేదే ఈ చిత్ర కథ అంటున్నారు. అయితే ఈ కథకు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసి సినిమా రూపొందిస్తున్నారట. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. 

More News

సీపీ అంజనీకుమార్‌కు ఉత్తమ్ వార్నింగ్.. ఏం జరిగింది!?

సినీ ఫక్కీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కీరవాణి, రాజమౌళి మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం: నిర్మాతలు రవిశంకర్, చెర్రి (చిరంజీవి)

మత్తువదలరా విషయంలో కథ బాగుంది సినిమా తీద్ధాం అని నిర్ణయం తీసుకోవడం తప్పితే ఈ రోజు సినిమా విజయంలో

మందు తాగి ర‌చ్చ చేసిన హీరోయిన్‌

బుజ్జిగాడు మేడిన్ చెన్నై స‌హా ప‌లు తెలుగు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న హీరోయిన్ సంజ‌నా గ‌ర్లాని బెంగ‌ళూరులోని ప‌బ్‌లో మ‌ద్యం తాగి ర‌చ్చ ర‌చ్చ చేసింది.

లిప్ లాక్ స‌మ‌యంలో భ‌య‌ప‌డ్డ పూజా హెగ్డే

ప్ర్త‌సుతం తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో న‌లుగురైదుగురు స్టార్ హీరోయిన్స్ మాత్ర‌మే ఉన్నారు. వారిలో పూజా హెగ్డే ఒక‌రు.

‘తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడే.. పవన్’!!

టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. ఆయనేంటో ఆయన్ను దగ్గర్నుంచి చూసిన వీరాభిమానులు,