కొర‌టాల‌, మ‌హేష్ మెసేజ్ అదేనా...?

  • IndiaGlitz, [Thursday,September 08 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్ర‌హ్మోత్సవం ప్లాప్ త‌ర్వాత ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ర‌కుల్ ప్రీత్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్, త‌న‌కు శ్రీమంతుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానిచ్చిన కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. డి.వి.వి.దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప‌నులు మెల్ల మెల్ల‌గా కొన‌సాగుతున్నాయి.

శ్రీమంతుడు చిత్రంతో మ‌హేష్ ఇమేజ్ ను డ‌బుల్ చేసిన కొర‌టాల ఈసారి మ‌రో ల‌వ్ యువ‌ర్ సెల్ఫ్ అనే మెసేజ్ తో కొత్త క‌థ‌ను రూపొందిస్తున్నాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని చెప్పిన శ్రీమంతుడు మహేష్ తో కొర‌టాల చేయ‌నున్న ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కొర‌టాల శివ రీసెంట్ మూవీ జ‌న‌తాగ్యారేజ్ టాక్ కు భిన్నంగా క‌లెక్ష‌న్స్ ను రాబట్టుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతుంది.

More News

నితిన్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో 14 రీల్స్‌ కొత్త చిత్రం ప్రారంభం

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్‌ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది.

నవరస నట తిలకం మోహన్ బాబు..!

తెలుగు తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి...ప్రేక్షకులను ఆకట్టుకుని తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు విలక్షణ నటుడు మోహన్ బాబు.

బాహుబ‌లి 2 కోసం నాగార్జున‌..!

బాహుబలి 2 ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే...మ‌రో వైపు చ‌క‌చ‌కా బిజినెస్ జ‌రిగిపోతుంది. ఇంత‌కీ బాహుబ‌లి 2 కోసం నాగార్జున..? ఏమిటి అనుకుంటున్నారా..?

అథ్లెటిక్ పాత్ర‌లో ర‌కుల్‌...

ప్ర‌స్తుతం  సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ ల చిత్రంతో పాటు మెగా ప‌వ‌ర్‌స్టార్  రామ్ చ‌ర‌ణ్ ధృవ చిత్రంతో పాటు సాయిద‌ర‌మ్ తేజ్, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుంది.

ఖైదీ నెం 150 రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన వినాయ‌క్..!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న‌150 చిత్రం ఖైదీ నెం 150. డైన‌మిక్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.