జాన్వి వినడం లేదా?
Send us your feedback to audioarticles@vaarta.com
నిన్నటి వరకు తల్లి కొంగుచాటు బిడ్డ జాన్వి కపూర్. తల్లి శ్రీదేవి చనిపోవడం, నాయికగా నటించిన `దఢక్` విడుదల కావడంతో ఓవర్నైట్ ఎక్స్ పోజర్ వచ్చి అందరికీ తెలిసిపోయింది ఈ అమ్మాయి. అయితే ఆమె ప్రత కదలికనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. జాన్వి ఎలాంటి దుస్తులు ధరిస్తోందనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకరిద్దరు సెలబ్రిటీలు కూడా బాహాటంగానే ఈ విషయాన్ని ప్రస్తావించారు. దాని గురించే ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తోందనుకుంటే, దానికి తోడు మరొకటి కూడా కలిసింది.
అదే ఆమె బెల్లీ డ్యాన్స్ చేస్తున్న వీడియో. చిన్న షార్ట్ వేసుకుని, ఆమె చేస్తున్న బెల్లీ డ్యాన్స్ వీడియో చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. వయ్యారాలు చిందిస్తూ ఆమె పక్కాగా డ్యాన్స్ చేసింది. ఆమె తల్లి శ్రీదేవి కూడా మంచి డ్యాన్సర్ అనే సంగతి తెలిసిందే. కమర్షియల్ చిత్రాల్లో శ్రీదేవి చేసిన డ్యాన్సులను నిన్నటి తరం వాళ్లు అంత తేలిగ్గా మర్చిపోలేరు. కుమార్తె జాన్విని కూడా తనంత పెద్ద నాయికను చేయాలని శ్రీదేవి ఆశపడ్డారు. అయితే ఆ కోరిక నెరవేరకుండానే కన్నుమూశారు. దఢక్ తర్వాత జాన్వి చేతిలో తక్త్ అని మరో సినిమా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.