close
Choose your channels

ఓటీటీలో ‘క్రాక్‌’.. నిజమెంత?

Monday, July 13, 2020 • తెలుగు Comments

ఓటీటీలో ‘క్రాక్‌’.. నిజమెంత?

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ చిత్రం` క్రాక్‌`. ఈ ఏడాది వేస‌విలో మే 8న సినిమా విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ కార‌ణంగా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఆగింది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న చిత్ర‌మిది.గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేద్దామంటే ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇప్ప‌ట్లో చెప్పేలా లేదు. దీంతో నిర్మాత‌లు ఏం చేయాలో తెలియ‌క టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చాలా మంది నిర్మాత‌లు వారి సినిమాల‌ను డిజిట‌ల్ మాధ్య‌మాల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు క్రాక్ సినిమాను కూడా అలాగే విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌ని మేక‌ర్స్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఓటీటీ విడుద‌ల కాబోయే ఓ మోస్త‌రు పెద్ద హీరో న‌టించిన తొలి చిత్ర‌మిదే అవుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. డాన్ శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితే, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz