ఓటీటీలో ‘క్రాక్‌’.. నిజమెంత?

  • IndiaGlitz, [Monday,July 13 2020]

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ లేటెస్ట్ చిత్రం' క్రాక్‌'. ఈ ఏడాది వేస‌విలో మే 8న సినిమా విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ కార‌ణంగా తుది ద‌శ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఆగింది. శృతిహాస‌న్ హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోన్న చిత్ర‌మిది.గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేద్దామంటే ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న ప‌రిస్థితుల్లో థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఇప్ప‌ట్లో చెప్పేలా లేదు. దీంతో నిర్మాత‌లు ఏం చేయాలో తెలియ‌క టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చాలా మంది నిర్మాత‌లు వారి సినిమాల‌ను డిజిట‌ల్ మాధ్య‌మాల్లో విడుద‌ల చేస్తున్నారు. ఇప్పుడు క్రాక్ సినిమాను కూడా అలాగే విడుద‌ల చేస్తే ఎలా ఉంటుంద‌ని మేక‌ర్స్ త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఓటీటీ విడుద‌ల కాబోయే ఓ మోస్త‌రు పెద్ద హీరో న‌టించిన తొలి చిత్ర‌మిదే అవుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. డాన్ శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితే, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

వెబ్ సిరీస్‌గా చ‌లం న‌వ‌ల ‘ మైదానం’

వెండితెర‌కు స‌మానంగా డిజిట‌ల్ మీడియాకు ప్రాధాన్య‌త పెరుగుతోంది. ఈ క‌మ్రంలో ప‌లు ఓటీటీ సంస్థ‌లు, ఏటీటీ సంస్థ‌లు రెడీ అవుతున్నాయి.

టిఫిన్ సెంట‌ర్ ఓన‌ర్‌గా మారిన యువ హీరో

ప్ర‌స్తుతం యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌.

సినిమా శాఖ‌ల్లో ఈ టీమ్ అస‌రం వ‌స్తుందా?

ఇప్ప‌టి వ‌ర‌కు 24 శాఖ‌లే సినిమాలకు ప‌నిచేస్తూ వ‌చ్చాయి. అయితే త్వ‌ర‌లోనే మ‌రో కొత్త శాఖ కూడా వీటితో జాయిన్ కానుంద‌ట‌.

అనంత పద్మనాభుని ఆలయ బాధ్యత వారిదే.. వివాదానికి చెక్ పెట్టిన సుప్రీం

కేరళలోనే ప్రఖ్యాతి చెందిన అనంత పద్మనాభ స్వామి ఆలయ వివాదానికి సంబంధించిన తుది తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించింది.

రాజధానులపై అంత పట్టుదలా.. చంద్రబాబుకు ప్రయోజనం చేకూరవద్దనేనా?

ముచ్చటగా మూడు రాజధానులు.. తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎప్పుడూ కనీవినని కాన్సెప్ట్.