డేటింగ్లో పవన్ హీరో్యిన్
Send us your feedback to audioarticles@vaarta.com
వయ్యారాలా జాబిల్లి ఓణీ కట్టి అంటూ పవన్‌ను తీన్మార్లో ఆకట్టుకున్న సొగసరి కృతి కర్బందా. ఈ ఢిల్లీ ముద్దుగుమ్మ పవన్‌తో `తీన్మార్` సినిమా చేయక ముందు కృతి కర్బందా కొన్ని తెలుగు సినిమాల్లో నటించినా తీన్మార్ తర్వాత పవన్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తర్వాత చరణ్ అక్కగా బ్రూస్లీ చిత్రంలోనూ నటించింది.
ఈమె ప్రస్తుతం బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్‌తో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. గత ఏడాది విడుదలైన వీరే కి వెడ్డింగ్ చిత్రంలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. అలాగే ప్రస్తుతం ఇద్దరూ పాగల్ పంతి చిత్రంలోనూ కలిసి నటిస్తున్నారు. ఈ జర్నీలో ఇద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్ చేస్తున్నారని టాక్. కృతి కోసం పుల్కిత్ దక్షిణాది వంటకాలను తినడానికి ఆసక్తిని కనపరుస్తున్నాడట. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంతో పుల్కిత్ కృతికి చాక్లెట్స్, పువ్వులు పంపిస్తున్నాడని కూడా సమాచారం.
శ్వేతా రోహితాను 2015లో వివాహం చేసుకున్న పుల్కిత్ సామ్రాట్.. ఆమె నుండి 2016లో విడాకులు తీసుకున్నారు. తర్వాత కొంత కాలంగా నటి యామీ గౌతమ్‌తో పుల్కిత్ లవ్ ఎఫైర్ నడిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు పుల్కిత్, కృతి కర్బందా మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇద్దరూ డేటింగ్ ఉన్నట్లు, ఎక్కడా చెప్పుకోవడం లేదు. మరి వీరి మధ్య బంధం ఎంత వరకు కొనసాగుతుందో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.