close
Choose your channels

మ‌హేశ్ 27.. ప్యాన్ ఇండియా మూవీనా..?

Wednesday, September 16, 2020 • తెలుగు Comments

మ‌హేశ్ 27.. ప్యాన్ ఇండియా మూవీనా..?

ఇప్పుడు తెలుగు స్టార్స్ అంద‌రూ ప్యాన్ ఇండియా హీరోలుగా ప్రూవ్ చేసుకోడానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌భాస్, య‌ష్ తర్వాత బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లే కాకుండా మ‌నోజ్ స‌హా మ‌రికొంద‌రు ప్యాన్ ఇండియాలో పాగా వేయ‌డానికి గ‌ట్టిగా ట్రై చేస్తున్నారు. కాగా తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ వీరిని చూసి నేనెందుకు చేయ‌కూడ‌దనుకున్నారేమో.. అనుకున్న‌దే త‌డువుగా త‌న ప్ర‌య‌త్నాన్ని స్టార్ట్ చేసేశాడు. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ చేస్తున్న సినిమా `స‌ర్కారువారి పాట‌`. ఈ సినిమాకు బాలీవుడ్ హంగులు యాడ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ స్టార్‌ అనీల్ కపూర్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. తాజాగా ఈ సినిమా లిస్టులో ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ చేర‌బోతున్నార‌ట‌. ఆ స్టార్ ఎవ‌రో కాదు.. విద్యాబాల‌న్‌.

ఇది వ‌ర‌కు తెలుతులో `య‌న్‌.టి.ఆర్` బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్ బ‌స‌వ‌తార‌క‌మ్మ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ సినిమాలో న‌టించ‌డం నిజ‌మైతే విద్యాబాల‌న్ న‌టించే రెండో తెలుగు సినిమా స‌ర్కారువారి పాట అవుతుంది. ఇందులో విద్యాబాల‌న్, మ‌హేశ్ సోద‌రి పాత్ర‌లో న‌టిస్తార‌ని స‌మాచారం. ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే యు.ఎస్ లో ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz