మ‌హేశ్ 27.. ప్యాన్ ఇండియా మూవీనా..?

  • IndiaGlitz, [Wednesday,September 16 2020]

ఇప్పుడు తెలుగు స్టార్స్ అంద‌రూ ప్యాన్ ఇండియా హీరోలుగా ప్రూవ్ చేసుకోడానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌భాస్, య‌ష్ తర్వాత బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లే కాకుండా మ‌నోజ్ స‌హా మ‌రికొంద‌రు ప్యాన్ ఇండియాలో పాగా వేయ‌డానికి గ‌ట్టిగా ట్రై చేస్తున్నారు. కాగా తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ వీరిని చూసి నేనెందుకు చేయ‌కూడ‌దనుకున్నారేమో.. అనుకున్న‌దే త‌డువుగా త‌న ప్ర‌య‌త్నాన్ని స్టార్ట్ చేసేశాడు. ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ చేస్తున్న సినిమా 'స‌ర్కారువారి పాట‌'. ఈ సినిమాకు బాలీవుడ్ హంగులు యాడ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ స్టార్‌ అనీల్ కపూర్ న‌టిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. తాజాగా ఈ సినిమా లిస్టులో ఇప్పుడు మ‌రో బాలీవుడ్ స్టార్ చేర‌బోతున్నార‌ట‌. ఆ స్టార్ ఎవ‌రో కాదు.. విద్యాబాల‌న్‌.

ఇది వ‌ర‌కు తెలుతులో 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌లో విద్యాబాల‌న్ బ‌స‌వ‌తార‌క‌మ్మ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హేశ్ సినిమాలో న‌టించ‌డం నిజ‌మైతే విద్యాబాల‌న్ న‌టించే రెండో తెలుగు సినిమా స‌ర్కారువారి పాట అవుతుంది. ఇందులో విద్యాబాల‌న్, మ‌హేశ్ సోద‌రి పాత్ర‌లో న‌టిస్తార‌ని స‌మాచారం. ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే యు.ఎస్ లో ప్రారంభం అవుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

More News

ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోంది. కరోనా కారణంగా చికిత్స నిమిత్తం ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

రవితేజ సరసన హాట్ భామ సీరత్!

టాలీవుడ్‌లో ఫైర్‌బాల్ ఆఫ్ హాట్‌నెస్‌గా పేరు తెచ్చుకున్న భామ సీరత్ కపూర్. ‘రన్ రాజా రన్’ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ..

'రాజ్ పుత్`షూటింగ్ ప్రారంభం!!

బంజారా బిగ్ సినిమాస్ ప‌తాకంపై బంజార భాష‌లో `గోర్ మాటి`గా తెలుగులో `రాజ్ పుత్‌`గా రెండు భాష‌ల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయ‌క్‌.

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 21 నుంచి 40 కొత్త రైళ్లు..

కరోనా మహమ్మారిని జనాలు కొద్దికొద్దిగా విస్మరించడం మొదలు పెట్టారు. యథావిథిగా కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి.

సుశాంత్ ఫామ్‌ హౌస్ పార్టీలకు సారా.. రియా వచ్చేవారు: రాయిస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.