close
Choose your channels

'మన్మథుడు 2' కథ కాపీనా.. అసలు సంగతి ఇదేనా!?

Monday, June 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మన్మథుడు 2 కథ కాపీనా.. అసలు సంగతి ఇదేనా!?

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ నటీనటులుగా రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమాలో నాగార్జున వయసు మళ్లినా పెళ్లి కాని బ్రహ్మచారి పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ గురించి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందుకు కారణం.. మన్మథుడు-2 స్టోరీ మొత్తం ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టారన్నది ఈ చర్చ సారాంశం. అయితే ఆ ఫ్రెంచ్ సినిమా చూసి డైరెక్టర్ మన్మథుడును రీమేక్ చేస్తున్నారా..? లేకుంటే కథ మూలం దాన్ని తీసుకుని పూర్తిగా మార్చేశారా..? అనేదానిపై ఇంతవరకూ దర్శకుడు క్లారిటీ ఇవ్వలేదు.

ఇది ఎంత వరకు నిజం..!

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 'prete moi ta main' (ప్ర‌పంచ వ్యాప్తంగా ఐ డూ పేరుతో విడుద‌లైంది)అనే ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పరోక్షంగా ఒప్పుకుందని తెలుస్తోంది. అయితే చిత్రనిర్మాతలు మాత్రం అసలు విషయాన్ని తర్వాత బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకులు చూసి అసలు చిత్రమేదో.. మూలం తీసుకుని సినిమా తీశామన్నది నిర్ణయిస్తారని ఇక ఇవన్నీ మాట్లాడటం సబబు కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

ఫ్రెంచ్ సినిమా సారాంశమేంటి..!

2006లో ‘ప్రేతే మెయి తా మై’ అనే ఫ్రెంచ్ మూవీ రిలీజై సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఈ చిత్రంలో హీరోకు 45 ఏళ్లు నిండినప్పటికీ పెళ్లి చేసుకోడు. దీంతో ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని ఒక‌టే పోరు పెడుతుంటారు. అది నచ్చ‌ని హీరో ఒక యువతిని ఇంట్లో త‌న భార్య అని ప‌రిచ‌యం చేస్తాడు. కానీ ఆమె అత‌ని అస‌లు భార్య కాదు.. అద్దెకు తెచ్చుకున్న భార్య‌. అయితే రాను రాను ఆ యువ‌తితోనే హీరో ప్రేమ‌లో ప‌డ‌తాడు. స్థూలంగా ఇదీ స్టోరీ.. అయితే సేమ్ టూ సేమ్ ఇప్పుడిదే క‌థ ఆధారంగా తెలుగులో ‘మ‌న్మ‌థుడు 2’ తీస్తున్నార‌ని విమర్శలు వస్తున్నాయి.

గతంలోనూ సేమ్ సీన్..!

ఇదిలా ఉంటే.. గ‌తంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన ‘అజ్ఞాత‌వాసి’ కూడా త్రివిక్ర‌మ్ ఓ విదేశీ భాషా చిత్ర క‌థ ఆధారంగా తీసుకుని తెరకెక్కించారని రచ్చ రచ్య అయ్యింది. అయితే అప్ప‌ట్లో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగినా.. మ‌ళ్లీ ‘మ‌న్మ‌థుడు-2’ తో మ‌రోసారి కాపీ వివాదం తెరపైకి వ‌చ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మ‌న్మ‌థుడు 2 క‌థ‌ను నిజంగానే పైన చెప్పిన ఆ ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ చేశారా..? లేదా..? అన్న వివ‌రాలు తెలియ‌లేదు. కానీ ఒక వేళ అదే నిజ‌మైతే ఆ చిత్ర యూనిట్ కూడా ‘మ‌న్మ‌థుడు 2’ బృందంపై కాపీ రైట్ వేస్తుంద‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే అది నిజ‌మో, కాదో తెలియాలంటే ‘మ‌న్మ‌థుడు- 2’ విడుద‌ల అయ్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే..!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.