close
Choose your channels

రీమేక్‌లో నటించ‌డానికి నాగ్ ఓకే చెబుతాడా?

Wednesday, October 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రీమేక్‌లో నటించ‌డానికి నాగ్ ఓకే చెబుతాడా?

కింగ్ నాగార్జున ఈ ఏడాది `మ‌న్మ‌థుడు 2`తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయ్యింది. అయితే నాగార్జున మ‌రో సినిమాకు క‌మిట్ కాలేదు. రియాలిటీ షో బిగ్‌బాస్ 3తో ఫుల్ బిజీగా మారిపోయారు. మ‌రో ప‌క్క కొత్త క‌థ‌ల‌ను కూడా వింటున్నారు. వీట‌న్నింటితో పాటు క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `బంగార్రాజు` చేయాల‌ని స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. కాగా.. నాగార్జున‌తో ఓ బాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాల‌ని సీనియ‌ర్ డిస్ట్రిబ్యూట‌ర్, ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌ సునీల్ నారంగ్ అనుకుంటున్నాడ‌ట‌.

వివ‌రాల్లోకెళ్తే.. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ చిత్రం `రైడ్‌`. ఈ చిత్రాన్ని తెలుగులో నాగార్జున‌తో రీమేక్ చేయాల‌నుకుంటున్నాడ‌ట సునీల్ నారంగ్‌. అయితే ప్ర‌స్తుతం నాగార్జున బిగ్‌బాస్ షోను పూర్తి చేసుకున్న త‌ర్వాతే చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని అనుకుంటున్నార‌ట‌. మ‌రి దీనికి సంబంధించిన స‌మాచారంపై క్లారిటీ రావాలంటే మ‌రి కొన్నిరోజులు ఆగ‌క త‌ప్పేలా లేదు. రైడ్ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇన్‌క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాడు. మరి ఈ రీమేక్‌లో నటించడానికి నాగ్ ఒప్పుకుంటాడా? అని వేచి చూడాల్సిందే..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.