close
Choose your channels

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

Wednesday, April 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎన్టీఆర్‌, మోహ‌న్‌లాల్‌... సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఈ సినిమాలో మ‌లయాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు విన‌ప‌డ్డాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు మోహ‌న్‌లాల్ పాత్ర‌పై మ‌రో వార్త విన‌ప‌డుతుంది. అదేంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో మోహ‌న్‌లాల్ కనిపిస్తాడట. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌లో పోరాట ప‌టిమ‌ను నింప‌డంలో ఆయ‌న బాబాయ్ పాత్ర‌లో చాలా కీల‌క‌మట‌. ఆ పాత్ర‌లో మోహ‌న్‌లాల్ న‌టిస్తున్నాడంటున్నారు. ఇక్క‌డొక సెంటిమెంట్ క‌న‌ప‌డుతుంది. గ‌తంలో మోహ‌న్‌లాల్, ఎన్టీఆర్ క‌లిసి జ‌న‌తాగ్యారేజ్‌లో న‌టించారు. అందులో ఎన్టీఆర్ పెద్ద‌నాన్న పాత్ర‌లో మోహ‌న్‌లాల్ క‌నిపించారు. ఆ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మ‌రోసారి ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్‌’ వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 8న విడుద‌ల‌వుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.