ఎన్టీఆర్ క‌థ‌నే ప‌వ‌న్ ఒప్పుకున్నాడా?

  • IndiaGlitz, [Sunday,May 17 2020]

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇప్పుడు వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వ‌కీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి గ్రీన్ ఇచ్చారు ప‌వ‌న్‌. కాగా.. హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు. రీసెంట్‌గా ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. అయితే ఈ సినిమా క‌థ‌కు సంబంధించిన వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

వివ‌రాల్లోకెళ్తే.. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కోసం డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఓ క‌థ‌ను సిద్ధం చేశాడ‌ట‌. అయితే ఎన్టీఆర్ ఆ క‌థ‌ను సింపుల్‌గా రిజెక్ట్ చేశాడ‌ట‌. అదే క‌థ‌ను ప‌వ‌న్‌కు హ‌రీశ్ వినిపిస్తే ఏమాత్రం మార్పులు చేర్పులు చెప్ప‌డ‌కుండా ప‌వ‌న్ ఓకే చెప్పార‌ని అంటున్నారు. సాధార‌ణంగా సోష‌ల్ మీడియాలో త‌న సినిమాల‌పై వినిపించే వార్త‌ల‌పై కాస్త గ‌ట్టిగా స్పందించే హ‌రీశ్ శంక‌ర్ మ‌రిప్పుడు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్న వార్త‌ల‌పై ఎ లా స్పందిస్తారో వేచి చూడాలి. వ‌కీల్ సాబ్ చివ‌రి పార్ట్ చిత్రీక‌ర‌ణ ముగిసిన త‌ర్వాత క్రిష్ సినిమాను పూర్తి చేసిన త‌ర్వాతే ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్ సినిమా స్టార్ట్ అవుతుంద‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

More News

మే-31 వరకు లాక్‌డౌన్ 4.0 .. మార్గదర్శకాలివే..

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాని కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగిస్తూ కేంద్రం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌ డౌన్‌ 4.0కు కేంద్రం సిద్ధం.. రేపే మార్గదర్శకాలు!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం విదితమే. రేపటితో అనగా ఆదివారం మే-17తో 3.0 లాక్‌డౌన్‌ను ఇండియా పూర్తి చేసుకోనుంది.

తెలుగు మార్కెట్‌పై హీరో విజ‌య్ ఫోక‌స్‌..

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట‌ర్‌`. ఎక్స్‌బీ ఫిలిం క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గ్జేవియ‌ర్ బ్రిటో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'బాహుబలి'గా మారిన డేవిడ్ వార్నర్..

కరోనా నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో సామాన్యుడి మొదలుకుని సెలబ్రిటీ వరకూ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.

‘ఆత్మ నిర్భర భారత్‌’ నాలుగో ప్యాకేజీ : 8 రంగాల్లో కీలక సంస్కరణలు

ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ ప్యాకేజీని ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటికే మూడు ప్యాకేజీలకు సంబంధించి వివరాలను