close
Choose your channels

కేసీఆర్‌ను పవన్ వ్యతిరేకిస్తారా.. మళ్లీ టార్గెట్ అవుతారా!?

Wednesday, February 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కేసీఆర్‌ను పవన్ వ్యతిరేకిస్తారా.. మళ్లీ టార్గెట్ అవుతారా!?

అప్పుడెప్పుడో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఊగిపోయి మాట్లాడిన సంగతి తెలిసిందే. ‘ఆడెవడో పవన్ కల్యాణ్ అంట..’ అంటూ అప్పట్లో జనసేనానిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడిన మాటలు పవన్ వీరాభిమానులు, జనసేన కార్యకర్తల కళ్లలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయ్. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరంటారుగా.. ఆ తర్వాత మళ్లీ పవన్-కేసీఆర్ ఇద్దరూ ఒక్కటైపోయారు. స్వయంగా ప్రగతి భవన్‌కు వెళ్లి గులాబీ బాస్‌ను పవన్ కలిసొచ్చారు. దీంతో వివాదాలన్నీ సద్దుమణిగినట్లయ్యాయ్. అయితే మళ్లీ కేసీఆర్‌ను పవన్ వ్యతిరేకించే దిశగా అడుగులేస్తున్నారని.. ఇదే జరిగితే పవన్ మరోసారి టార్గెట్ అవుతారని.. దీంతో లేనిపోని పరిణామాలు చోటుచేసుకున్నా ఆశ్చర్యపడనక్కర్లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

అసలేమైంది..!?

దేశ‌వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యతిరేకతనే తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటీకీ వర్కవుట్ అవ్వట్లేదు. సీఏఏను పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ ఆ తర్వాత అసలు విషయాలు తీసుకుని కళ్లు తెరుచుకున్నాయేమో కానీ.. అబ్బే తాము కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. ఇందుకు ఏపీలోని అధికార పార్టీ వైసీపీయే చక్కటి ఉదాహరణ. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఇక్కడి ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు బీజేపీ-జనసేన కార్యకర్తలు, నేతలు భారీ సన్నాహాలే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ సీఏఏను వ్యతిరేకించడం.. కేంద్రాన్ని పదే పదే విమర్శి్స్తుండటంతో గులాబీ బాస్‌కు వ్యతిరేకంగా.. సీఏఏ గురించి నిజానిజాలు చెప్పేందుకు రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి , బీజేపీలో నంబర్-02 అయిన అమిత్ షా రానున్నట్లు తెలుస్తోంది.

పవన్ వెళ్లి ఏం చేస్తాడో!?

ఈ కార్యక్రమం బీజేపీ-జనసేన కలిసి చేస్తుండటంతో పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని సమాచారం. సభలో మాట్లాడాల్సి వస్తే కచ్చితంగా సీఏఏను వ్యతిరేకిస్తున్న కేసీఆర్, జగన్ గురించి మాట్లాడక తప్పదు. ఇదే జరిగితే కేసీఆర్‌తో అంతంత మాత్రమే ఉండే సంబంధాలు కూడా తెగిపోతాయ్. ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటికి పని పెట్టాల్సి వస్తుంది.. అంతేకాదు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉండే నేతలు కూడా నోటికి బుద్ధి చెప్పి విమర్శలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇది మాటలు వరకే పరిమితం అవుతుందో లేకుంటే ఒక వేళ కేసీఆర్ ఇంకాస్త సీరియస్‌గా తీసుకుంటే ఐటీ రైడ్స్ ఇలా పెద్ద పెద్ద పనులు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఒకే వేదికపై సరే.. బ్యాలెన్స్ లేకపోతే..!

పవన్ కూడా హాజరు కావాల్సి వస్తే.. కేంద్ర మంత్రి అమిత్ షాతో కలిసి ఒకే వేదికపై కూర్చుంటారు. బీజేపీ-జనసేన కలిసి ముందుకెళ్తున్నాయ్ గనుక కచ్చితంగా షా మాట్లాడిన తర్వాత లేదా ముందుగా అయినా సీఏఏ గురించి మాట్లాడి వ్యతిరేకిస్తున్నవారిపై విమర్శలు గుప్పించక తప్పదు మరి. ఈ విషయంలో పవన్ నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అంతేకాదు.. బ్యాలెన్స్‌గా మాట్లాడాల్సిన అవసరం కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. మరి కేసీఆర్ గురించి మాట్లాడి టార్గెట్ అవుతారో లేకుంటే వెళ్లామా..? వచ్చామా..? అన్నట్లుగా అలా వచ్చి ఇలా వెళ్తారో..? అసలు ఈ భారీ బహిరంగ సభ అనేది ఎంతవరకూ నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.