ప్ర‌భాస్ ప‌ర్య‌వేక్షిస్తున్నారా?

  • IndiaGlitz, [Monday,July 15 2019]

'సాహో'కి సంబంధించి అన్ని ప‌నుల‌నూ ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారా? ఇప్ప‌టిదాకా ఎంత సొంత ప్రొడ‌క్ష‌న్ హౌస్ అయినా.. ఆయ‌న త‌న న‌ట‌న త‌ప్ప మిగిలిన వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. కానీ తాజాగా ప్ర‌భాస్ అన్ని ప‌నులూ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నార‌ట‌. ' బాహుబ‌లి' త‌ర్వాత ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'సాహో'. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా దాదాపుగా పూర్త‌య్యాయట‌. ఒక్క సీజీ త‌ప్ప అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. విడుద‌ల‌కు కేవ‌లం నెల రోజులే ఉన్న నేప‌థ్యంలో సీజీ ప‌నులు పూర్తి కాక‌పోవ‌డం వ‌ల్ల యూనిట్‌లో కాస్త కంగారు క‌నిపిస్తోంద‌ట‌. ఆ వేవ్స్ ప్ర‌భాస్ వ‌ర‌కూ వెళ్లాయ‌ని, అందుకే ఆయ‌న కాస్త కేర్ తీసుకుంటున్నార‌నీ టాక్‌. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. శ్ర‌ద్దాక‌పూర్ నాయిక‌గా న‌టించింది. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాకు ఇప్ప‌టికే అమిత‌మైన క్రేజ్ వ‌చ్చింది. యువీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్‌, విక్కీ నిర్మిస్తున్నారు.