close
Choose your channels

'క్రాక్' కాపీ క‌థ‌నా?

Wednesday, January 29, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `క్రాక్‌`. ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమా ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ. అయితే ఈ సినిమాకు మూల క‌థ ఓ త‌మిళ సినిమా నుండి తీసుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆ సినిమా ఏదో కాదు.. కోలీవుడ్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా నటించిన సేతుప‌తి సినిమానే. నిజానికి ఈ సినిమాను తెలుగులో గంటా శ్రీనివాస్ త‌న‌యుడు ర‌వి హీరోగా జ‌య‌దేవ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అయితే అదే క‌థ‌ను తెలుగులో మ‌ళ్లీ రీమేక్ చేస్తున్నార‌ని టాక్.

ఇది వ‌ర‌కు త‌మిళంలో విజ‌య్ తెరి సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే గోపీచంద్ మ‌లినేని అలాంటివేమీ లేద‌ని ఆ వార్త‌ల‌ను కొట్టి పారేశారు. మ‌రిప్పుడు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలున్నాయి. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.