వర్మ దానికి ఒప్పకుంటారా?

రామ్‌గోపాల్‌ వర్మ... తెలుగులో సంచనాలకు మారుపేరు. అక్కడిదాకా అంతా బావుంది. ఆ మాటను ఆయన ఎంజాయ్‌ కూడా చేస్తారు. కానీ ఆయన్ని పట్టుకుని సైకో అంటే ఒప్పుకుంటారా? వర్మ బయోపిక్‌... సారీ భయోపిక్‌ తీస్తానంటే ఏమంటారు? ఆయన ఏమంటారో ఏమో కానీ, ఆయన ఏమంటారు అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్‌ థింగ్‌ అని అంటోంది ఫిల్మ్ చాంబర్‌. ఆ మేరకు మేకర్స్ కి ఓ లెటర్‌ కూడా పంపింది. విజయవాడకు చెందిన మాగ్నస్‌ సినీ ప్రైమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాను తాను డైరక్ట్ చేస్తానని జొన్నవిత్తుల ఇప్పటికే ప్రకటించేశారు. ఆ మేరకు 'ఆర్జీవీ' సైకో భయోపిక్‌ అని టైటిల్‌ని కూడా ప్రకటించారు.

అయితే టైటిల్‌ని ఫిల్మ్ చాంబర్‌ అంగీకరించలేదు. పైగా ఈ టైటిల్‌కి ఓకే చెప్పాలంటే తప్పకుండా, ఆర్జీవీ పర్మిషన్‌ ఉండాలని అన్నారు. మరోవైపు ఆర్జీవీకి, జొన్నవిత్తులకు అసలు పడదు. ఆర్జీవీ కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా గురించి తన అభిప్రాయాన్ని బాహాటంగా అప్పట్లో వ్యక్తం చేశారు జొన్నవిత్తుల. అది నచ్చని ఆర్జీవీ మై బోయ్‌.. జొన్నపొత్తుల అంటూ వరుస ట్వీట్లు వేశారు. ఆ ట్వీట్లతో విసుగు చెందిన జొన్నవిత్తుల ఈ భయోపిక్‌ కి డైరక్ట్ చేస్తానని ప్రకటించారు. అయితే ఇంకా సినిమా ప్రొడక్షన్‌ పనులు ఓకే కాలేదు. విశాఖపట్టణానికి చెందిన మాగ్నస్‌ సినీ ప్రైమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాత్రం టైటిల్‌ని యాక్సెప్ట్ చేయాలని ఛాంబర్‌ని కోరింది. కానీ చాంబర్‌ వర్మ నుంచి ఎన్‌ఓసీ కోరడం కొసమెరుపు.

More News

నాడు ఎన్టీఆర్.. నేడు పవన్ అంతే.. తప్పేముంది!?

జనసేనకు గుండెకాయ లాంటి నేతగా పేరుగాంచిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

కళ్లార్పలేనంత థ్రిల్.. ‘హిట్’ పక్కానేమో!?

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్పణ‌లో వాల్ పోస్టర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా

మరోసారి డ్యూయెల్ రోల్‌లో ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

సీరియస్ ప్లానింగ్‌లో అల్లు అర‌వింద్‌?

టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన అల్లు అర‌వింద్ సినీ రంగంతో పాటు రీసెంట్‌గా  డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

పవన్ కు షాక్ .. జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. జేడీ ఎస్ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు.