ఆర్జీవీని అరెస్ట్ ఖాయ‌మా?

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? అవున‌నే స‌మాధానం సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతుంది. ఇంత‌కు ఆర్టీవీ అరెస్ట్ ఎందుకో తెలుసా? 'అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు' సినిమా విష‌యంలో కె.ఎ.పాల్ వ‌ర్మ‌పై పెట్టిన కేసు సంబంధంగా ఇప్పుడు పోలీసులు వ‌ర్మ‌కు నోటీసులు జారీ చేశారు. ఈ సినిమాలో కె.ఎ.పాల్‌ను కామెడీ చూపించిన వ‌ర్మపై కె.ఎ.పాల్ సీరియ‌స్ అయ్యాడు. అమెరికా నుండి వ‌చ్చి కేసు వేశాడు. ఈయ‌న కార‌ణంగా ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా రెండు వారాల పాటు వాయిదా ప‌డింది. సెన్సార్ విష‌యంలోనూ పెద్ద గొడ‌వే జ‌రిగింది. కోర్టు వాద‌న‌ల త‌ర్వాత చివ‌రి నిమిషంలోనే సెన్సార్ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది.

సెన్సార్ స‌ర్టిఫికేట్ వ‌చ్చిన త‌ర్వాత వ‌ర్మ కె.ఎ.పాల్ త‌న‌కు సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇచ్చిన‌ట్లు ఓ మార్ఫింగ్ ఫొటోను పోస్ట్ చేశారు. గ‌తంలో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని క‌లిసిన ఫొటోను వ‌ర్మ పాల్ ఉన్న‌ట్లుగా మార్ఫింగ్ చేశారు. దీనిపై సీరియ‌స్ అయిన పాల్ మ‌రోసారి వ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. దీంతో పోలీసులు మ‌రోసారి వ‌ర్మ‌కు నోటీసులు పంపారు. మ‌రి వ‌ర్మ దీనిపై ఎలా స్పందిస్తాడో తెలియ‌డం లేదు. కానీ నోటీసులు ఇచ్చిన త‌ర్వాత వ‌ర్మ‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

More News

‘దిశ చట్టం కాదు జగన్.. ముందు ఆ రెండు కేసులు తేల్చు..!’

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’ అనంతరం ఆ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో యావత్ ప్రపంచం.. తెలంగాణ పోలీసులను, ముఖ్యంగా సీఎం కేసీఆర్, సీపీ సజ్జనార్ పేరు మార్మోగింది.

సినిమాల్లోకి రీ ఎంట్రీపై తేల్చేసిన పవన్ కల్యాణ్..

టాలీవుడ్ టాటా చెప్పేసి.. రాజకీయాల్లో రాణించాలని రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్.. జనసేన అంటూ పార్టీ స్థాపించి ఎన్నికల బరిలోకి దూకాడు. అయితే సినిమాల్లో రాణించినంతగా రాజకీయాల్లో మాత్రం ఆయన రాణించకలేకపోయారు.

ఒక వేళ పవన్ సినిమాల్లోకి రాకపోయుంటే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని.. పవర్ స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అంతేకాదు..

నాగబాబులోని రెండో కోణాన్ని బయటపెట్టిన పవన్!

మెగాస్టార్ నాగబాబు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు హీరోతో పాటు పలు పత్రాల్లో నటించి మెప్పించిన ఈయన.. ఇప్పుడు మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు. అంతేకాదు..

'రూల‌ర్‌' అభిమానులు, ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రూల‌ర్‌`. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య్ర‌క‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్యక్ర‌మాలు పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 20న