రోబో 2.0 రిలీజ్ అప్పుడా..

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్రం రోబో 2.0. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న అమీ జాక్స‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా... బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా న‌టిస్తున్నారు. సంగీత సంచ‌ల‌నం ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 100 రోజులు షూటింగ్ తో 50% సినిమా పూర్త‌య్యింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ఈ భారీ చిత్రాన్ని ముందుగా 2017 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే...2017 ద‌స‌రాకి రోబో 2.0 రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి..ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More News

చ‌ర‌ణ్ - సుకుమార్ మూవీ అప్ డేట్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ధృవ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత చ‌ర‌ణ్ సుకుమార్ తో ఓ మూవీ చేయ‌నున్నారు. ఈ చిత్రం ఆగ‌ష్టులో ప్రారంభం కానున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

రూటు మార్చిన న‌వ‌దీప్

జై సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన న‌వ‌దీప్...మొద‌టి సినిమా, చంద‌మామ చిత్రాల‌తో విజ‌యం సాధించినా...ఎందుక‌నో ఆశించిన స్ధాయిలో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయాడు.

'బిచ్చగాడు' వసూళ్లు 16కోట్లు

చదలవాడ తిరుపతిరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగా ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’ ను తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో మే 13న విడుదల చేసిన విషయం విదితమే.

రామ్ స్టోరీ రివీల్ చేసిన క‌ట్ట‌ప్ప‌

నేను శైల‌జ సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తాజాగా కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

పట్టుదలే కారణం అంటున్నఅనుష్క బ్రదర్

సూపర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...అనతి కాలంలోనే తన అందం,అభినయంతో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నబెంగుళూరు భామ అనుష్క.