‘RRR’ రిలీజ్‌ ప్లాన్‌ మారుతుందా?

  • IndiaGlitz, [Monday,November 11 2019]

ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతోన్న ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘RRR’. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రానున్న సినిమా కావడంతో టాలీవుడ్‌ సహా అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. అంతే కాకుండా టాలీవుడ్‌ స్టార్‌ హీరోలైన యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా.. సినిమా ప్రారంభంలో సినిమాను వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

అయితే మధ్యలే రామ్‌చరణ్‌ గాయపడటం, ఎన్టీఆర్‌ చేతికి గాయమవడం వంటి కారణాలతో షూటింగ్‌ షెడ్యూల్స్‌ ఆలస్యమైయ్యాయి. ఇప్పుడు ఈ ఆలస్యం సినిమా విడుదల విషయంలో కీలకంగా మారింది. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి పోస్ట్‌ ప్రొడక్షన్‌కి ఆరు నెలల సమయం తీసుకుంటాడు. అంటే డిసెంబర్‌కి షూటింగ్‌ పూర్తయితే జూలైకి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది కానీ పరిస్థితి మారడంతో సినిమా విడుదల తేదీని మార్చాలని దర్శక నిర్మాతలు అనుకుంటన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. వచ్చే ఏడాది దసరా సందర్భంలోనైనా లేకుంటే 2021 సంక్రాంతికి కానీ సినిమాను విడుదల చేస్తే అసలు ఎక్కువ గాభరా పడాల్సిన పని ఉండదని అనుకుంటున్నారట. మరి దీనిపై చిత్ర యూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు

More News

హాలీవుడ్‌ సినిమాకు డబ్బింగ్‌ చెప్పనున్న మహేశ్‌ కుమార్తె

సూపర్‌స్టార్‌ మహేశ్‌ కుమార్తె సితార ఓ హాలీవుడ్‌ మూవీకి డబ్బింగ్‌ చెప్పనుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

డిసెంబర్ 6 న 'బ్యూటిఫుల్' విడుదల

రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).

'చీమ - ప్రేమ మధ్యలో భామ!' డిసెంబర్  విడుదల

మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు దర్శకత్వం లో

‘పవన్.. మీ ముగ్గురు భార్యల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?’

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన ప్రవేశపెడుతున్న సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెనుప్రమాదం

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగివున్న పాసింజర్ రైలును ఎంఎంటీఎస్ ఢీకొన్నది.