close
Choose your channels

స‌మంత ఆనంద‌ప‌డుతోందా? అనుమానిస్తుందా?

Friday, May 22, 2020 • తెలుగు Comments

స‌మంత ఆనంద‌ప‌డుతోందా? అనుమానిస్తుందా?

స‌మంత అక్కినేని రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే ఆమె ఆనంద‌ప‌డుతుందా? లేక అనుమాన ప‌డుతుందా? అనిపిస్తుంది. ఎందుకంటే స‌మంత ఫొటో చూస్తే అలాగే అనిపిస్తుంద‌ని అనుకుంటున్నారు. ఇంత‌కు స‌మంత ఏ పోస్ట్ చేసిందో తెలుసా? భ‌ర్త నాగ‌చైత‌న్య గురించి. వివ‌రాల్లోకెళ్తే.. స‌మంత ఫ్యామిలీ మెంబ‌ర్ రానా ద‌గ్గుబాటి, మిహీకా బ‌జాజ్‌లు త్వ‌ర‌లోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. పెళ్లికొడుకు, పెళ్లికుమార్తె కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి రోకా వేడుక‌ను నిర్వ‌హించుకున్నారు. ఈ వేడుక‌లో సురేశ్‌బాబు, వెంక‌టేశ్‌, నాగచైత‌న్య‌, స‌మంత స‌హా ఇత‌ర కుటుంబ స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

స‌మంత ఆనంద‌ప‌డుతోందా? అనుమానిస్తుందా?

ఫంక్ష‌న్ అనంత‌రం అమ్మ‌లు, అక్క‌లు, ఇత‌ర బంధువుల‌ను పంపేసిన త‌ర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో షేర్ చేయ‌డానికి వీలైందంటూ చైత‌న్య‌తో క‌లిసి ఉన్న ఫోటోను, సోలోగా చైత‌న్య ఫోటోను షేర్ చేసిన స‌మంత చైత‌న్య చూడండి ఎంత అందంగా ఉన్నాడో ఎక్క‌డో గోతులు త‌వ్వుతున్నాడు అంటూ మెసేజ్ పోస్ట్ చేసింది. ఈ మెసేజ్ కార‌ణంగా చైత‌న్య లుక్‌పై స‌మంత జెల‌సీగా ఉంద‌ని, అత‌న్ని అనుమానిస్తుంద‌ని స‌ర‌దాగాఅనుకుంటున్నారు. క్వారంటైన్ టైమ్‌లో ఇంటికే ప‌రిమిత‌మైన చైత‌న్య‌, స‌మంత రానా రోకా వేడుక‌క‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz