సందీప్ వంగాకు షాక్‌.. సినిమా ఆగిందా?

  • IndiaGlitz, [Tuesday,February 18 2020]

తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తో తెలుగులో భారీ హిట్‌ను సొంతం చేసుకున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ హీరోగా ఎదిగాడు. త‌ర్వాత సందీప్ త‌న మ‌కాంను ముంబైకి మార్చాడు. తెలుగులో త‌న‌కు డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చిన అర్జున్ రెడ్డి చిత్రాన్నే క‌బీర్ సింగ్ పేరుతో తెర‌కెక్కించి భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. 2019లో విడుద‌లైన బాలీవుడ్ చిత్రాల‌న్నింటిలో క‌బీర్ సింగ్ భారీ విజయాన్ని ద‌క్కించుకుంది.

షాహిద్‌క‌పూర్‌కు ఈ సినిమాతో స్టార్ హీరో రేంజ్ ద‌క్కింది. త‌ర్వాత సందీప్ త‌న మూడో సినిమాను బాలీవుడ్‌లోనే స్టార్ట్ చేశాడు. టి సిరీస్ వారితో క‌లిసి ఓ డార్క్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేశాడు. ర‌ణ‌భీర్ క‌పూర్‌, ర‌ణ్వీర్ సింగ్ వంటి హీరోల‌తో ఈ సినిమా చేయ‌డానికి సందీప్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేశాడు. కానీ ఏవీ ఫ‌లించ‌లేదు. సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు సందీప్ రెండో బాలీవుడ్ చిత్రం ఆగిపోయింద‌ట‌.

ఇప్పుడు సందీప్ త‌న మ‌కాంను హైద‌రాబాద్‌కే మార్చాడ‌ట‌. ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడ‌ట‌. అంతా అనుకున్న‌ట్లుగా అయితే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో ప్ర‌భాస్‌, సందీప్ కాంబినేష‌న్‌లో సినిమా ట్రాక్ ఎక్కే అవ‌కాశాలుండొచ్చు.

More News

రాజ‌కీయాల గురించి మ‌హేశ్ ఏమ‌న్నాడంటే..?

సూప‌ర్‌స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేసిన మ‌హేశ్ సూప‌ర్‌స్టార్ రేంజ్‌కు చేరుకున్నాడు.

'భీష్మ' సక్సెస్ గ్యారంటీ..! - ప్రి రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు త్రివిక్రమ్

యువ కథానాయకుడు నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ సోమవారం యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో

హర్భజన్ సింగ్ 'ఫ్రెండ్ షిప్' చిత్రంలో కీలక పాత్రలో అర్జున్

తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో విశేష కృషి చేసిన ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్

మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ హీరోయిన్‌గా యాంకర్!

సినిమా రంగానికి మూడేళ్లుగా దూరంగా ఉన్న మంచు మనోజ్ ఎట్టకేల‌కు తాజగా ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రాన్ని ప్రకటించారు.

యువతకు శుభవార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయడంఖా మోగించిన తర్వాత వాలెంటర్లు, సచివాలయ పోస్టులతో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి