ఆ లిస్ట్ లో అఖిల్ చేరతాడా?

  • IndiaGlitz, [Saturday,September 16 2017]

ఇప్పుడున్న అగ్ర క‌థానాయ‌కుల్లో చాలా మంది తొలి చిత్రంతో హిట్ కొట్ట‌లేక‌పోయినా.. రెండో చిత్రంతో మాత్రం విజ‌యాన్ని త‌మ సొంతం చేసుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి తొలి హిట్, రెండో చిత్ర‌మైన గోకులంతో సీత ఇస్తే.. ఎన్టీఆర్‌కి రెండో చిత్రం స్టూడెంట్ నెం.1 ఇచ్చింది. రామ్‌చ‌ర‌ణ్‌కి తొలి చిత్రం ఫ‌ర‌వాలేద‌నిపిస్తే.. రెండో చిత్రం మ‌గ‌ధీర సెన్సేష‌న‌ల్ హిట్ ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో తొలి చిత్రం అఖిల్‌తో నిరాశ‌ప‌డ్డ‌ అక్కినేని వారి యువ క‌థానాయ‌కుడు అఖిల్‌కి కూడా రెండో చిత్రం హ‌లో.. అలాంటి ఫీట్ రిపీట్ చేస్తుందేమో చూడాలంటున్నారు విశ్లేష‌కులు. అంతేకాదు.. అఖిల్ అన్న నాగ‌చైత‌న్య‌కి కూడా తొలి చిత్రం జోష్ నిరాశ‌ప‌రిస్తే.. రెండో చిత్రం ఏమాయ చేసావె హిట్ చిత్రంగా నిలిచింది. మ‌రి.. అఖిల్ కూడా పైన చెప్పుకున్న క‌థానాయ‌కుల్లాగా రెండో చిత్రంతో హిట్ కి బోణి కొడ‌తాడేమో చూడాలి.

More News

ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మహానటి. టైటిల్ రోల్లో కీర్తి సురేష్ నటిస్తుండగా.. ముఖ్య పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ ల్మాన్, ప్రకాష్ రాజ్, షాలిని పాండే తదితరులు నటిస్తున్నారు.

రాశి.. మూడేళ్ల త‌రువాత‌

2014లో విడుద‌లైన త‌న తొలి తెలుగు చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే తో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న రాశి ఖ‌న్నా.. త‌న రెండో తెలుగు చిత్రం జోరుతో మంచి గాయ‌నిగానూ పేరు తెచ్చుకుంది.

ఆ ద‌ర్శ‌కుడికి అదో స‌ర‌దా

ప‌టాస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అనిల్ రావిపూడి.. రెండో చిత్రాన్ని సుప్రీమ్‌గా తెర‌కెక్కించి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు ప్ర‌భుదేవా వంతు..

సీనియ‌ర్ హీరోల‌తో పాటు, క‌థ‌, క‌థ‌నం బావుంటే యంగ్ హీరోలు కూడా నెగ‌టివ్ షేడ్ ఉన్న క్యారెక్ట‌ర్స్ చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. వివ‌రాల్లోకెళ్తే..కొరియోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్ర‌భుదేవా త‌ర్వాత డ్యాన్స్ మాస్ట‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా మారారు.

మోహ‌న్‌బాబుతో ఐటెమ్ భామ‌లు...

విల‌క్ష‌ణ న‌టుడిగా, నిర్మాత‌గా రాణించిన మోహ‌న్‌బాబు చాలా గ్యాప్ త‌ర్వాత పూర్తి స్థాయి చిత్రంలో న‌టిస్తున్న చిత్రం 'గాయ‌త్రి'. ఇందులో మోహ‌న్‌బాబు త‌న‌యుడు, హీరో విష్ణు కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మోహ‌న్‌బాబు త‌న‌య‌గా నిఖిలా విమ‌ల్ న‌టిస్తుంది.