close
Choose your channels

`శీన‌య్య` ఆగిపోయిందా?

Wednesday, February 12, 2020 • తెలుగు Comments

`శీన‌య్య` ఆగిపోయిందా?

ఒక‌ప్పుడు అగ్ర క‌థానాయ‌కులంద‌రితో సినిమా చేసిన మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌. ఈ ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్య తెర‌కెక్కించిన సినిమాలేవీ ఆడ‌క‌పోవ‌డంతో త‌దుప‌రి సినిమా  చేసే ద‌ర్శ‌క నిర్మాత‌లు క‌రువ‌య్యారు. ఆ త‌రుణంలో త‌న బ్యాన‌ర్‌కు దిల్ చిత్రంతో హిట్ ఇచ్చి నిల‌బెట్టిన వినాయ‌క్‌ను దిల్‌రాజు ముందుకు వ‌చ్చాడు. స‌రే! కొత్త ప్ర‌య‌త్నం క‌దా అని వినాయ‌క్ కూడా ఓకే చెప్పాడు. శ‌ర‌భ ఫేమ్ న‌ర‌సింహ ద‌ర్శ‌క‌త్వంలో శీన‌య్య పేరుతో సినిమా స్టార్ట్ అయ్యింది. సినిమా కోసం బొద్దుగా ఉన్న వినాయ‌క్ క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా త‌యార‌య్యాడు.

డిసెంబ‌ర్‌లో సినిమా తొలిషెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించుకుని పూర్తి కూడా చేసుకుంది. ర‌షెష్ చూసిన వినాయ‌క్‌, దిల్‌రాజుకు పెద్దగా న‌చ్చ‌లేదట‌. ఆ విష‌యాన్ని డైరెక్ట‌ర్‌కు చెప్పాడు. దాంతో డైరెక్ట‌ర్ మ‌రోసారి స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేశాడు. అయితే వినాయ‌క్‌కి స్క్రిప్ట్ న‌చ్చ‌లేద‌ట‌. దీంతో దిల్‌రాజుకి సినిమాను ఆపేద్దామ‌ని చెప్పాడ‌ట‌. దిల్‌రాజు కూడా ఫైన‌ల్ నిర్ణ‌యం వినాయ‌క్‌కి వ‌దిలేశాడ‌ట‌. దాంతో వినాయ‌క్ సినిమా ఆపేశాడ‌ని సినీ వ‌ర్గాల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz