close
Choose your channels

బిగ్‌బాస్-3 హోస్ట్‌గా స్టార్ హీరో ఫిక్స్..!?

Friday, April 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్-3 హోస్ట్‌గా స్టార్ హీరో ఫిక్స్..!?

తెలుగులో బిగ్‌బాస్ 1,2 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్.. టూకు నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌‌గా వ్యవహరించిన విషయం విధితమే. సెకండ్ సీజన్ మొదట పెద్దగా హిట్టవ్వకపోయినప్పటికీ రానురాను డోస్ పెంచిన నానీ సూపర్ డూపర్ హిట్ చేసేశారు. అయితే సీజన్ దగ్గరపడుతుండటంతో త్రీకి ఎవరు వ్యాఖ్యత అనేది దానిపై ‘మా’ టీవీ యాజమాన్యం వెతికే పనిలో నిమగ్నమైందట. 

నాగ్ ఫిక్స్.. ఆయనే ఎందుకు..!?

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు బిగ్‌బాస్-3కి టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జునను తీసుకోవాలని భావిస్తోందట. కింగ్‌నే ఎందుకు తీసుకోవాలనేదానికి బోలెడు కారణాలు కూడా ఉన్నాయట. ఇప్పటికే ‘మా’ టీవీలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంను విజయవంతంగా రన్ చేసిన ట్రాక్ రికార్డ్ నాగార్జునకే సొంతం.. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యమనేనని చెప్పుకోవాలి. అయితే మొదట ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అసలు నాగ్ ఈ ప్రోగ్రాంను రన్ చేసి మెప్పిస్తాడా..? అని అందరిలో డౌట్ ఉండేది అయితే ఎవరూ ఊహించని రీతిలో కింగ్ సక్సెస్‌ఫుల్ రన్ చేసి అందర్నీ మెప్పించాడు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కంటే గ్రాండ్ సక్సెస్‌గా షో నడిపారని పలువురు ప్రముఖులు సైతం కితాబిచ్చిన సందర్భాలున్నాయి.

అప్పుడు కోటీశ్వరుడు.. ఇప్పుడు బిగ్‌బాస్!

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాంను సక్సెస్ చేసినట్టే.. నాగ్‌కు బిగ్‌బాస్- 3ని అప్పగిస్తే కచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలడని ‘మా’ యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 13 మంది హోస్ట్‌ల పేర్లు పరిశీలించినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే హోస్ట్‌లుగా ఉన్న ఎన్టీఆర్, నాని, విజయదేవరకొండతో పాటు పలువురు హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పరిశీలించిన అనంతరం మా యాజమాన్యం ఫైనల్‌గా నాగ్ పేరును ఫిక్స్ చేసేసిందని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ‘మన్మథుడు 2’, ‘బంగార్రాజు’ రెండూ కూడా సొంత బ్యానర్‌లో కాబట్టి బిగ్‌బాస్ హోస్ట్‌గా చేసేందుకు పెద్ద అడ్డంకులు కూడా ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్‌ వరకు నాగ్ పేరు వినపడుతుందా..? లేదా..? ఒక వేళ కింగ్ పేరు ఫిక్స్ అయితే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లాగా రక్తి కట్టిస్తాడా ..? లేడా ఢీలా పడతాడా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.