కేసీఆర్ వచ్చి ఫీల్డ్‌లో నిలబడటానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచా?: ఒవైసీ

సీఎం కేసీఆర్ కనిపించడం లేదనే వార్తలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అసలు సీఎం ఎలా కనిపించకుండా పోతారని తిరిగి ప్రశ్నించారు. అలా అంటే ఆయన ప్రభుత్వాన్ని నడపడం లేదనే అర్థం వస్తుందన్నారు. సీఎం వచ్చి ఫీల్డ్‌లో నిలిచేందుకు ఇదేమైనా క్రికెట్ మ్యాచా? అని ప్రశ్నించారు. ఆయన ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారని అసదుద్దీన్ తెలిపారు.

‘‘అది ఎలా సాధ్యం? ముఖ్యమంత్రి ఎలా తప్పిపోతారు? సీఎం కనిపించడం లేదంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? ఆయన కనిపించడం లేదంటే.. ప్రభుత్వాన్ని నడపడం లేదనే కదా  అర్థం? అలాంటిదేమీ లేదు. ఆయనొక ముఖ్యమంత్రి. బ్యూరోక్రసీ, మంత్రులకు ఆయన టచ్‌లోనే ఉంటున్నారు. ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నారు. ఒకవేళ సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ప్రజలు దీనిని నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? సీఎం తప్పిపోయారని మీరెలా చెప్పగలరు? ఆయనేం తప్పిపోలేదు. నేను, కొందరు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు సీఎంతో మాట్లాడామో చెప్పాలా? సీఎం, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కమిషనర్ అంతా ఉన్నారు. ఎవరూ ఎక్కడికీ పోలేదు. సీఎం వచ్చి ఫీల్డ్‌లో నిలబడటానికి ఇదేమైనా క్రికెట్ మ్యాచా? ఆయన ప్రతిదీ పర్యవేక్షిస్తున్నారు’’ అని అసదుద్దీన్ తెలిపారు.

More News

ఏపీలో సడెన్‌గా పెరిగిన కరోనా కేసులు.. కారణం ఇదేనా?

కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. టెస్టుల మొదలు.. ట్రేసింగ్.. ట్రీట్‌‌మెంట్ అంతా పర్‌ఫెక్ట్‌గా జరుగుతోంది.

తెలంగాణలో కొత్తగా 1524 కేసులు నమోదు..

తెలంగాణలో మంగళవారం కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

కొరియోగ్రాఫ‌ర్‌గా సాయిప‌ల్ల‌వి

తెలుగులో ఫిదా చిత్రంతో ప్రేక్ష‌కుల హృద‌యాల్ని దోచుకున్న సాయిప‌ల్లవి త‌ర్వాత ఏంసీఏ, క‌ణం త‌దిత‌ర చిత్రాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది.

యూత్‌కి షాకిస్తున్న కరోనా తాజా అధ్యయనాలు

కరోనాపై రోజురోజుకూ వెలువడుతున్న అధ్యయనాలు ఒక్కొక్క అపోహనూ కొట్టి పారేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మళ్లీ మళ్లీ సోకే అవకాశముందంటూ షాక్ ఇవ్వగా..

అందుకే ‘పుష్ప’ నుంచి తప్పుకున్నా: విజయ్ సేతుపతి

నటనతో అభిమానులను సంపాదించుకునే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. వారిలో కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకరు.