ఉయ్యాలవాడ కుటుంబం వెనక్కి తగ్గడం వెనుక కారణం ఇదే ?

  • IndiaGlitz, [Friday,October 04 2019]

బ్రిటీష్ వారితో స్వాతంత్య్రోద‌మం కోసం పోరాడిన వీరుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి. ఈయ‌న జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్ర‌మే 'సైరా న‌ర‌సింహారెడ్డి'. ఈ సినిమా అనుకున్నంత సుల‌భంగా ప్రేక్ష‌కుల ముందుకు రాలేదు. ఎందుకంటే.. సినిమా మేకింగ్ ఓ క‌ష్ట‌త‌ర‌మైన విష‌య‌మైతే.. మ‌రో ప‌క్క ఉయ్యాలవాడ వంశీకులు త‌మ కుటుంబానికి చ‌ర‌ణ్ ఇస్తాన‌ని చెప్పిన ఆర్థిక సాయం చేయ‌లేదంటూ ఆందోళ‌న‌లు చేశారు. కోర్టుకు, మాన‌వ హ‌క్కుల క‌మీష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. అయితే తీర్పు నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌కు అనుకూలంగానే వ‌చ్చింది.

నిజానికి చ‌ర‌ణ్ ఉయ్యాల‌వాడ వంశీకుల‌కు ఏదో కొంత సాయం చేస్తాన‌ని చెప్పాడ‌ట‌. అయితే వారు రూ.5కోట్లు డిమాండ్ చేయ‌డంతో చ‌ర‌ణ్ అండ్ టీం కోర్టును ఆశ్ర‌యించింద‌ట‌. సినిమాకు ముందు చ‌ర‌ణ్ కోర్టులో కేసు వేసిన ఆరుగురికి మూడు ల‌క్ష‌ల చొప్పున ఇచ్చాడ‌ట‌. ఉయ్యాల‌వాడ ప్రాంతానికి ఏదో ఒక‌టి చేస్తాన‌ని కూడా మాటిచ్చాడ‌ట‌. భ‌విష్య‌త్‌లో ఉయ్యాల‌వాడ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ‌స్తాన‌ని కూడా చెప్పాడ‌ని స‌మాచారం.

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ 2న ప్యాన్ ఇండియా చిత్రంగా విడుద‌లై హిట్ టాక్ సంపాదించుకుని మంచి కలెక్ష‌న్స్‌ను సాధిస్తుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

More News

త‌మ‌న్నాకు షాకిచ్చిన ఉపాస‌న‌

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న కొణిదెల షాకిచ్చింది. ఇంత‌కు ఉపాసన ఎందుకు మిల్కీ బ్యూటీకి షాకిచ్చిందనే వివ‌రాల్లోకెళ్లే..

ర‌జ‌నీ `ద‌ర్బార్` షూటింగ్ పూర్తి

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా  స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ చిత్రం నిర్మించిన చిత్రం `ద‌ర్బార్‌`.

సైరా యూనిట్‌కి అల్లు వారి పార్టీ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`

'లైఫ్ స్టైల్ ' ఫస్ట్ లుక్ లాంచ్

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వకుళాభరణం మోహనకృష్ణ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ఇస్మార్ట్‌పై బాలీవుడ్ క‌న్ను

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు హ్యూజ్ హిట్ సాధించిన చిత్రాల్లో `ఇస్మార్ట్ శంక‌ర్` ఒక‌టి. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌,