close
Choose your channels

అల్లు అర్జున్ 21... పాయింట్ అదేనా?

Saturday, August 1, 2020 • తెలుగు Comments

అల్లు అర్జున్ 21... పాయింట్ అదేనా?

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ త‌న కెరీర్‌ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేసిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో నాన్ బాహుబ‌లి రికార్డులు సాధించారు. ఇప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ప్యాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’గా కనిపించడానికి రెడీ అయ్యారు. కరోనా ప్రభావం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగింది కానీ.. లేకుంటే ఈ పాటికి సినిమా సెట్స్‌పై ఉండాల్సింది. ఈ సినిమా ప్రారంభం కానే లేదు.. ఆలోప‌లే మ‌రో సినిమాకు ఓకే చెప్పేశారు స్టైలిష్ స్టార్‌. మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయారు.

మెసేజ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో చెబుతూ అన్నీ విజ‌య‌వంత‌మైన చిత్రాల‌నే తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండ‌టం విశేషం. ఈ చిత్రం ద్వారా కొర‌టాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాక‌ర్‌, బ‌న్నీ స్నేహితుడు శాండీ, స్వాతి, న‌ట్టి నిర్మాత‌లుగా మారుతున్నారు. ఈ మ‌ధ్య వైజాగ్‌లో జ‌రిగిన గ్యాస్ లీకేజీ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని క‌థ సాగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రీసెర్చ్ స్టూడెంట్ అయిన హీరో ఓ ప్రాంతంలో గ్యాస్ లీకేజీ ప్ర‌మాదంలో చనిపోయిన వారి గురించి చేసే అన్వేష‌ణ‌లా క‌థ సాగుతుంద‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై బ‌న్నీ అండ్ గ్యాంగ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz