'వీడెవ‌డు' క‌థ ఇదేనా?

  • IndiaGlitz, [Sunday,September 10 2017]

స‌చిన్ జోషి హీరోగా న‌టించిన సినిమా 'వీడెవ‌డు'. ఈ నెల 15న విడుద‌ల కానుంది. తెలుగులో త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల‌ని స‌చిన్ ఎప్ప‌టినుంచో ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు.

అందులో భాగంగా ఆయ‌న న‌టించిన తాజా సినిమా 'వీడెవ‌డు'. తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఇందులో స‌చిన్ క‌బ‌డ్డీ ప్లేయ‌ర్‌గా క‌నిపిస్తారు. ఆయ‌న భార్య‌గా బాలీవుడ్ న‌టి ఈషా గుప్తా న‌టించారు.

ఈ సినిమాను రైనా జోషి నిర్మించారు. పెళ్ల‌యిన మ‌రుస‌టి రోజే క‌బ‌డ్డీ ప్లేయ‌ర్ భార్య చ‌నిపోతుంది. ఆమెది హ‌త్యా? ఆత్మ‌హ‌త్యా? హ‌త్య అయితే ఎవ‌రు చేశారు? ఆత్మ‌హ‌త్య అయితే ఆమె అలాంటి అఘాయిత్యానికి పాల్ప‌డ‌టానికి కార‌ణం ఏంటి? వ‌ంటి అంశాల‌తో తెర‌కెక్కిన సినిమా. ఈ చిత్రంతో త‌ప్ప‌కుండా హిట్ కొడ‌తాన‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు స‌చిన్ జోషి.

More News

రేణు కొత్త అవతారం...

రేణు దేశాయ్..ఈ పేరు తెలుగు సినీ లోకాని పరిచయం అక్కర్లేని పేరు.

'సాహో' ఇంట్రెస్టింగ్ అప్ డేట్...

బాహుబలి చిత్రంతో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్.

అభిమానికి డార్లింగ్ కానుక...

అందరినీ అభిమానంతో డార్లింగ్ అని పిలుచుకునే హీరో యంగ్రెబల్ స్టార్ ప్రభాస్.

వచ్చే వారం లిస్ట్ పెద్దదే

ఈ మధ్య కాలంలో ప్రతి వారం కనీసం రెండు సినిమాలైనా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

వి వై కంబైన్స్ బ్యానర్ లోగో విడుదల

శ్రీ సత్యన్నారాయణ బొక్క సమర్పణ సంస్థ లో వస్తున్న వి.వై బ్యానర్ మరియు లోగో ను దాసరి నారాయణ రావు గారి అబ్బాయి, నటుడు అరుణ్ కుమార్ చే విడుదల చేయించారు నిర్మాణ అధ్యక్షులు.