close
Choose your channels

‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ నుండి వచ్చే ఇచ్చే స‌ర్‌ప్రైజ్ అదేనా?

Monday, July 27, 2020 • తెలుగు Comments

రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’. దీనికి ముందుభాగం ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా మూవీగా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా నుండి రేపు(మంగ‌ళ‌వారం) ఓ స‌ర్‌ప్రైజ్ రానుందంటూ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అస‌లు కె.జి.య‌ఫ్ యూనిట్ ప్రేక్ష‌కులకు ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌నుందోన‌ని అంద‌రిలో ఆస‌క్తి మొద‌లైంది.

అస‌లు విష‌య‌మేమంటే.. మంగ‌ళ‌వారం కె.జి.య‌ఫ్ యూనిట్ ఇవ్వ‌బోయే స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలుసా? ‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’లో ప‌వ‌ర్‌పుల్ విల‌న్ అధీరా పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సంజ‌య్ ద‌త్ పుట్టిన‌రోజు జూలై 29. ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం అధీరా లుక్‌ను విడుద‌ల చేయ‌నుంది. నిజా నిజాలు తెలియాలంటే కొన్ని గంట‌ల వెయిటింగ్ త‌ప్ప‌దు.

‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ తుది ద‌శ షూటింగ్‌కు చేరుకుంది. మ‌రో ముప్పై రోజుల షూటింగ్ మిగిలి ఉంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఈ పాటికి సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉండేది. ఇప్పుడు క‌రోనా క‌రోనా కార‌ణంగా సినిమా షూటింగ్ ఆగింది.

Get Breaking News Alerts From IndiaGlitz