మ‌హేష్ - మురుగుదాస్ మూవీ టైటిల్..!

  • IndiaGlitz, [Monday,October 24 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ్ లో 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు.ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి.

అయితే...ప్ర‌చారంలో ఉన్న టైటిల్స్ కాద‌ని...ఇంకా ఏ టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేయాలేద‌ని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించారు. తాజాగా ఏజెంట్ శివ అనే టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఏజెంట్ శివ టైటిల్ డిజైన్ చేసి పోస్ట్ చేస్తున్నారు. అయితే... ప్ర‌చారంలో ఉన్న‌ తాజా టైటిల్ పై చిత్ర యూనిట్ స్పందించ‌లేదు. దీపావ‌ళి కానుక‌గా టైటిల్ & ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి...ఈ టైటిల్ నే క‌న్ ఫ‌ర్మ్ చేస్తారేమో చూడాలి..!

More News

లహరి మ్యూజిక్ ద్వారా ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి, బాహుబలి 2...ఈ మూడు భారీ చిత్రాల ఆడియోలు విడుదల..!

ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత జి.మనోహర్ నాయుడు మాట్లాడుతూ....చిరంజీవి గారి సినిమాలు మాస్టర్, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముఠామేస్త్రి, ఆపధ్భాంధవుడు, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ముగ్గురు మొనగాళ్లు చిత్రాల ఆడియోలను మా సంస్థ ద్వారానే రిలీజ్ చేసాం.

అభిమానులకు కమల్ విన్నపం...

యూనివర్సల్ హీరో,విలక్షణ నటుడు కమల్ హాసన్ శభాష్ నాయుడు సినిమాతో బిజీగా ఉన్నాడు.

చివరిరోజు చిత్రీకరణలో 'సింగం3'

సూర్య,హరి సూపర్ హిట్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా వివరించనక్లర్లేదు.

చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో వ‌చ్చేస్తుంది..!

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన ప్రేమ‌మ్ ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ సంతోషంతో చైతు సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

ప‌వ‌ర్ స్టార్ కాట‌మ‌రాయుడు రిలీజ్ డేట్..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని గోపాల గోపాల ఫేమ్ డాలీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.