బాబుకు తలనొప్పిగా తోట బ్రదర్స్.. జంప్ కన్ఫామా!?

  • IndiaGlitz, [Monday,March 04 2019]

తూర్పు గోదావరి జిల్లాలో తోట బ్రదర్స్‌‌కు జనాల్లో ఉన్న పేరు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తోట నరసింహులు ఎంపీగా, తోట త్రిమూర్తులు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచారు. మంత్రి పదవి వస్తుందని ఆశించినప్పటికీ కొన్ని అనివార్యకారణాల వల్ల రాలేదని కార్యకర్తలు చెబుతుంటారు. ఇక రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నరసింహం తిష్టవేసి కూర్చున్నారు. అయితే ఇప్పటికే ఈ నియోజకవర్గాన్ని ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన జ్యోతుల నెహ్రుకు బాబు ఫిక్స్ చేసేశారు. మళ్లీ మార్పులు చేర్పులు ఉంటాయన్నది చిన్నపాటి కోరికతో ఆయన మళ్లీ చంద్రబాబును కలవడానికి సిద్ధమయ్యారు. ఆరు నూరైనా జగ్గంపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అతి త్వరలోనే అధినేతను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి బ్రదర్స్ సిద్ధమయ్యారు. అయితే టికెట్ రాకపోతే తప్పకుండా పార్టీ మారతారని పెద్దఎత్తున ఊహాగానాలు వస్తున్నాయి.

తోట బ్రదర్స్‌‌తీరుతో చంద్రబాబుకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. మొదట్నుంచి తోట ఫ్యామిలీ అటు పవన్‌ను కానీ.. ఇటు జగన్‌‌ను కానీ దాఖలాలు దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో అని ముందుగానే గ్రహించిన బ్రదర్స్ ఎవర్నీ అతిగా విమర్శించనూ లేదు. దీంతో అప్పట్నుంచే చంద్రబాబుకు తోట బ్రదర్స్‌పై అనుమానాలు మొదలయ్యాయని అందుకే మంత్రి పదవి కూడా ఇవ్వకుండా బాబు ఎగ్గొట్టారని చెబుతుంటారు. సో అసలు ఈయన పార్టీ మారతారా లేదా అన్నది మరో రెండ్రోజుల్లో తేలిపోతుందన్న మాట.

కాగా.. ఎప్పట్నుంచే వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డితో తోట బ్రదర్స్‌ టచ్‌లో ఉన్నారని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తూ.గోలో అంతంత మాత్రమే ఉన్న వైసీపీకి తోట బ్రదర్స్‌‌‌ బలం కలిస్తే ఎదురుండదని అధినేత భావిస్తున్నట్లు సమాచారం. అయితే రేపోమాపో టికెట్ విషయం తేల్చుకుని జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే తమ పార్టీలో చేరాలని తోట నర్సింహులు ఇంటికి జనసేనకు సంబంధించిన కొందరు నేతలు ఆయన్ను కలవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ ఆలోచన లేదని సునితంగా ఆయన మంచి మాటలతోనే చెప్పి నేతలను పంపించారు.

తోట బ్రదర్స్ వైసీపీలోకి వస్తే రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు పార్టీ అధికారంలోకి వస్తే ఒక మంత్రి పదవి సైతం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న బ్రదర్స్‌‌.. ఈసారి వైసీపీ బీపామ్ మీదనే పోటీచేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం మొత్తం రెండ్రోజుల్లో తేలిపోతుందని సమాచారం. వైసీపీలో వీరి చేరిక ఉంటుందా.. ? ఉండదా..? ఉంటే ఎప్పుడు ఉంటుంది..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల్లో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడనుందన్న మాట.

More News

సింహ‌పురి చేరిన జ‌న‌సేనాని పోరాట యాత్ర

జ‌న‌సేన పోరాట యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా ప‌ర్యట‌న ముగించుకున్న ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో రెండో రోజు ప‌ర్యట‌న‌లో భాగంగా ఆదివారం

బ్రేకింగ్: మసూద్ అజర్ ఖతం హోగయా..!?

అవును మీరు వింటున్నది నిజమే.. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజర్ ఖతం హోగయా..!?

సంచలనం: ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు.. ఆయనే సీఎం

తెలంగాణలో పూర్తిగా గాలిపోయిన ‘సైకిల్’కు పంచర్లు వేసి నడిపేందుకు అధిష్టానం సిద్ధమైందా..?

అభినందన్‌‌‌కు జరిపిన‌‌‌ వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే...

పాక్ చెరనుంచి విడుదలైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్, రియల్ హీరో అభినందన్‌‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రాములమ్మ పోరాటం

2018 ముందస్తు ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌‌లోకి వలసలు ఆగట్లేదు.