close
Choose your channels

త్రివిక్రమ్ ఆమెకి స్కోప్ ఇచ్చాడా?

Wednesday, May 11, 2016 • తెలుగు Comments

త్రివిక్ర‌మ్  త‌న పాత శైలికి వెళ్లి రూపొందించిన చిత్రం 'అ..ఆ..'  నితిన్, స‌మంత‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, న‌దియా.. ఇలా భారీ తార‌గ‌ణ‌మే ఈ చిత్రంలో న‌టించింది. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను, యువ‌త‌ని లక్ష్యం గా చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొత్తం స‌మంత క్యారెక్ట‌ర్ చుట్టూ తిరుగుతుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. అలాంటిది రెండో హీరోయిన్‌గా న‌టించిన అనుప‌మ‌కి సినిమాలో ఎంత వ‌ర‌కు ఇంపార్టెంట్ ఉంటుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకంటే.. స‌మంత హీరోయిన్ గా త్రివిక్ర‌మ్ రూపొందించిన 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' సినిమాలో నిత్యా మీన‌న్ లాంటి యాక్ట్ర‌స్ నే సెకండ్ లీడ్ గా ప్ర‌జెంట్ చేస్తే.. ఆమె పాత్ర‌ని మ‌రీ డ‌మ్మీగా చూపించేశారు మాటల మాంత్రికుడు. ఈ నేప‌థ్యంలో 'అ..ఆ..'లో అనుప‌మ‌కైనా స్కోప్ ఇచ్చి ఉంటాడా? అనేది ఫిల్మ్ న‌గ‌ర్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.