సురేంద‌ర్ రెడ్డి, వ‌రుణ్‌తేజ్ సినిమా అందుకే ఆగిందా?

గ‌త ఏడాది మెగాస్టార్ చిరంజీవితో 'సైరా న‌ర‌సింహారెడ్డి' వంటి హిస్టారిక‌ల్ సినిమా చేసిన ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. ఈ సినిమా త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. 'సైరా న‌ర‌సింహారెడ్డి' త‌ర్వాత సురేంద‌ర్ రెడ్డి ప్ర‌భాస్‌తో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే ఆ సినిమా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఎందుకంటే ప్ర‌భాస్ త‌న 20వ సినిమా 'రాధేశ్యామ్‌'(విన‌ప‌డుతున్న టైటిల్‌)తో బిజీగా ఉన్నాడు. త‌ర్వాత సురేంద‌ర్ త‌న ద‌ర్శ‌క నిర్మాణంలోనే వ‌రుణ్‌తేజ్‌తో సినిమా చేస్తాడ‌నే వార్త‌లు కూడా వినిపించాయి. కానీ వ‌రుణ్‌తేజ్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వలేదు. చిరులాంటి అగ్ర క‌థానాయ‌కుడితో సినిమా చేసిన ఈ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి ఎవ‌రూ ఆస‌క్తి చూప‌డం లేద‌ట‌.

ఒక ప‌క్క 'రంగ‌స్థ‌లం' వంటి హిట్ త‌ర్వాత సుకుమార్‌, 'భ‌ర‌త్ అనే నేను' అనే సినిమా త‌ర్వాత కొర‌టాల శివ కూడా గ్యాప్ తీసేసుకోవాల్సి వ‌చ్చింది. త‌ప్ప‌లేదు. ఇప్పుడు వీరి బాట‌లోనే సురేంద‌ర్ రెడ్డికి కూడా గ్యాప్ వ‌చ్చేలాగానే క‌న‌ప‌డుతుంది. అయితే మ‌రో ప‌క్క వ‌రుణ్‌తేజ్ సినిమాను సురేంద‌ర్‌రెడ్డితో క్యాన్సిల్ అయిపోవ‌డానికి కార‌ణం..సైరా రిలీజ్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌, సురేంద‌ర్ రెడ్డికి ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వ‌లేక‌పోవ‌డంతో సురేంద‌ర్ ద‌ర్శ‌కుల సంఘంలో ఫిర్యాదు చేశాడ‌ని, ఆ కోపంతోనే మెగా హీరోలు సురేంద‌ర్ రెడ్డిని ప‌క్క‌న పెట్టేశార‌ని కూడా వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి సురేందర్ రెడ్డి కొత్త సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో చూడాలి.

More News

చిన్మ‌యి క్ష‌మాప‌ణ‌లు చెబితేనే చోటిస్తాం:  రాధా ర‌వి

డ‌బ్బింగ్ కళాకారుల సంఘం అధ్య‌క్షుడిగా ఎన్నికైన సీనియ‌ర్ న‌టుడు రాధార‌వి ఎన్నికైన సంగ‌తి తెలిసిందే.

డబ్బింగ్ చెప్తున్నంతసేపూ 'భీష్మ' చాలా క్యూట్ ఫిల్మ్ అనిపించింది - రష్మికా మందన్న

"డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది.

ఆస్కార్ మూవీకి కోర్టు నోటీసులివ్వాలంనుకుంటున్న నిర్మాత‌

రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఆస్కార్ అవార్డ్స్‌లో ద‌క్షిణ కొరియా చిత్రం `పార‌సైట్‌`కు ఏకంగా నాలుగు అవార్డులు ద‌క్కాయి.

చ‌ర‌ణ్‌పై బ‌న్నీ ఫ్యాన్స్ గుస్సా?

మెగాస్టార్ చిరంజీవి స‌పోర్ట్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు డ‌జ‌ను హీరోలు ఆ ఫ్యామిలీ నుండి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఓక సాంగ్ మిన‌హ షూటింగ్ పూర్తిచేసుకున్న 'రావ‌ణ‌ లంక‌'

ఒక సినిమా ప్రేక్ష‌కుల ద‌గ్గ‌రికి తీసుకువెళ్లాలంటే దానికి టైటిల్ ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. ప్రేక్ష‌కుల నానుడిగా వుండే టైటిల్స్ ఎప్పూడూ ఇట్టే ఆక‌ట్టుకుంటాయి.