దసరా కానుకగా కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'

  • IndiaGlitz, [Friday,September 02 2016]

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి స్పెయిన్‌లో చేసిన భారీ షెడ్యూల్‌తో ప్యాచ్‌వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరా కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వుంటూనే చాలా పవర్‌ఫుల్‌గా సాగే ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో ఫస్ట్‌ టైమ్‌ నటిస్తున్న కళ్యాణ్‌రామ్‌ సిక్స్‌ ప్యాక్‌ ఫస్ట్‌లుక్‌ను నందమూరి హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ...జర్నలిస్ట్‌గా ఒక పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కళ్యాణ్‌రామ్‌ కనిపిస్తారు. కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ఇదో డిఫరెంట్‌ మూవీ అవుతుంది. అలాగే డైరెక్టర్‌గా నాకు ఓ పవర్‌ఫుల్ మూవీ ఇది అన్నారు.

నందమూరి కళ్యాణ్‌రామ్‌, అదితి ఆర్య, జగపతిబాబు, గొల్లపూడి మారుతిరావు, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, ఆలీ, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్‌, బండ రఘు, శత్రు, అజయ్‌ఘోష్‌, శ్రీకాంత్‌, కోటేష్‌ మాధవ, నయన్‌(ముంబై), రవి(ముంబై) తదిరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌, ఎడిటింగ్‌: జునైద్‌, పాటలు: భాస్కరభట్ల, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: జానీ, కో-డైరెక్టర్‌: గురు, మేకప్‌ చీఫ్‌: బాషా, కాస్ట్యూమ్స్‌ చీఫ్‌: గౌస్‌, ప్రొడక్షన్‌ చీఫ్‌: బి.అశోక్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అశ్విన్‌, స్టిల్స్‌: ఆనంద్‌, మేనేజర్స్‌: బి.రవికుమార్‌, బి.వి.నారాయణరాజు(నాని), వినయ్‌, క్యాషియర్‌: వంశీ, నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

More News

పూరి ఇజం స్పెషల్ పోస్టర్ రిలీజ్..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం ఇజం.

ప్యాచ్ మినహా 'ఇజం' పూర్తి....

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇజం.

బన్నితో ముచ్చటగా మూడోసారి....?

రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి,సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్

రెండు సినిమాలను అనౌన్స్ చేస్తానంటున్న నాగ్....

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం భక్తి రస ప్రధాన చిత్రం ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ మంచి సినిమా అంటూ అభినందిస్తుంటే షాక‌య్యాను - కొర‌టాల‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన జ‌న‌తా గ్యారేజ్ రిలీజైన అన్నిచోట్లా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.