నితిన్ జ‌త‌గా ఇస్మార్ట్ బ్యూటీ!!

  • IndiaGlitz, [Thursday,June 11 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన 'భీష్మ'తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి బాలీవుడ్ రీమేక్ సినిమా కూడా ఉంది. బాలీవుడ్‌లో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు న‌టించిన 'అంధాదున్' సినిమా పెద్ద హిట్టైన సంగ‌తి తెలిసిందే. దాని రీమేక్ హ‌క్కుల‌ను నితిన్ ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి సోష‌ల్ మీడియాలో రోజుకొక వార్త చ‌క్క‌ర్లు కొడుతూనే ఉంది. రీసెంట్‌గా బాలీవుడ్‌లో ట‌బు చేసిన పాత్ర‌ను శిల్పాశెట్టితో చేయిస్తార‌ని వార్త‌లు వినించాయి.

తాజాగా హిందీలో రాధికాఅప్టే పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై కూడా మ‌రో ఆస‌క్త‌కిర‌మైన వార్తొక‌టి హ‌ల్ చ‌ల్ చేస్తుంది. నిజానికి ముందుగా నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుద‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇస్మార్ట్ శంక‌ర్‌, న‌న్ను దోచుకుందువ‌టే చిత్రాల ఫేమ్ న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుందంటున్నారు. ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

రీమేక్‌లో న‌టించ‌డానికి విశ్వ‌క్‌సేన్ ఓకే అంటాడా?

వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన విశ్వ‌క్‌సేన్‌కు ఈన‌గ‌రానికి ఏమైంది సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

రోల్ కోసం ప్రియ‌మ‌ణి రియ‌ల్ ట్రైనింగ్‌

కొంద‌రు న‌టీన‌టులు కొన్ని పాత్ర‌ల‌ను ఆషామాషీగా తీసుకోరు.

లాస్ట్ షెడ్యూల్ జ‌రుపుకోనున్న 'సీటీమార్'

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ హీరోగా, మాస్ డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌  పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం `సీటీమార్‌`.

BB3 టీజ‌ర్ అదిరిపోయింది అంటున్నారు అంద‌రూ : బాల‌కృష్ణ

'సింహా', 'లెజెండ్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో

మలయాళ రీమేక్ డైరెక్ట‌ర్ ఖ‌రారు?

తెలుగు సహా అన్నీ భాషల్లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్నాయి.