యూ ట్యూబ్‌లో 'ఇస్మార్ శంక‌ర్' రికార్డ్‌

  • IndiaGlitz, [Wednesday,April 29 2020]

అప్ప‌టి వ‌ర‌కు చాక్లెట్ బోయ్‌, ల‌వ‌ర్‌బోయ్ అనే ఇమేజ్‌తో సినిమాలు చేసుకుంటూ వ‌చ్చిన రామ్‌ను స‌రికొత్త‌గా ఆవిష్క‌రించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌దైన మాస్ యాంగిల్‌లో తెలంగాణ పోర‌డుగా రామ్‌ను వెండితెర‌పై ప్రెజెంట్ చేశాడు. ఇక రామ్ మాస్‌కు న‌భా న‌టేశ్‌, నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్ తోడయ్యాయి. ఇవ‌న్నీ ఓ ఎత్తైతే మ‌ణిశ‌ర్మ సంగీతం మ‌రో ఎత్తు. చాలా కాలంగా స‌రైన మ్యూజిక్ ఆల్బ‌మ్ ఇవ్వ‌ని మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న బాణీల‌లోని ప‌వ‌ర్‌ను కొత్త‌గా ఎలివేట్ చేశాడు. ప్ర‌తిపాట అంద‌రినీ మెప్పించింది. రామ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ మూవీగా నిలిచిన ఇస్మార్ట్ శంక‌ర్‌.. చాలా కాలంగా హిట్ లేని పూరీ జ‌గ‌న్నాథ్‌ను మ‌ళ్లీ నిల‌బెట్టింది.

ఇప్పుడు ఈ సినిమా యూ ట్యూబ్‌లో రికార్డుల‌ను కొల్ల‌గొడుతుంది. సాధార‌ణంగా త‌న తెలుగు డ‌బ్బింగ్ సినిమాల‌కు హిందీలో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ కోవ‌లో ఇస్మార్ట్ శంక‌ర్ హిందీ అనువాదం యూ ట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేయ‌డం విశేషం. ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయని టాక్ విన‌ప‌డుతోంది.

More News

పాలిటిక్స్‌లోకి రీ ఎంట్రీపై పెదవి విప్పిన చిరు.. ఆనందంలో ఫ్యాన్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టాలీవుడ్ సీనియర్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సీఎం

అన్నీ రూమ‌ర్సేన‌ట‌.. న‌వీన్ క్లారిటీ

నంద‌మూరి బాల‌కృష్ణ 106వ సినిమాను బోయపాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఓ షెడ్యూల్‌ను రామోజీ ఫిలింసిటీలో పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

క్వారంటైన్ టైమ్‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్న హీరోయిన్‌

కోవిడ్ 19 ఎఫెక్ట్‌తోదేశ‌మంత‌టా లాక్‌డౌన్‌లో దిగ్బంధ‌నం అయ్యింది. దీంతో సామాన్యులే కాదు సెల‌బ్రిటీలు సైతం ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. షూటింగ్స్ క్యాన్సిల్ అయిపోవ‌డంతో సినీ సెల‌బ్రిటీలు

‘మ‌హా స‌ముద్రం’లో మ‌రో హీరో..?

తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో సూప‌ర్‌హిట్ అందుకున్నాడు అజ‌య్ భూప‌తి. త‌ర్వాత ‘మ‌హా స‌ముద్రం’ అనే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకున్నాడు.

బ‌యోపిక్ వార్త‌ల‌పై న‌రేష్ క్లారిటీ

సీనియ‌ర్ న‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు, గిన్నిస్‌బుక్ రికార్డ్ హోల్డ‌ర్ విజ‌య నిర్మ‌ల గ‌త ఏడాది ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూసిన సంగతి తెలిసిందే.