close
Choose your channels

రామ్ పుట్టినరోజున 'ఇస్మార్ట్ శంక‌ర్‌' టీజ‌ర్ విడుద‌ల‌

Tuesday, May 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్ పుట్టినరోజున ఇస్మార్ట్ శంక‌ర్‌ టీజ‌ర్ విడుద‌ల‌

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న  చిత్రం 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. 'డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ' ట్యాగ్ టైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. అందులో భాగంగా గోవాలో రామ్ న‌భా న‌టేశ్‌ల‌పై ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. భాను మాస్ట‌ర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు.

రామ్ జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు విడుద‌ల చేస్తున్నారు. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.