శ్రియకే చెల్లింది

  • IndiaGlitz, [Monday,August 21 2017]

ప‌ద‌హారేళ్లుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది అందాల న‌టి శ్రియా శ‌ర‌న్‌. ఇప్ప‌టికీ పెద్ద హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా ద‌ర్శ‌న‌మిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి లో అభిన‌యానికి ప్రాధాన్య‌మున్న వ‌శిష్టీదేవి పాత్ర‌లో మార్కులు కొట్టేసిన శ్రియ‌.. తాజాగా పైసా వ‌సూల్‌లోనూ ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాల్లోనూ బాల‌కృష్ణనే హీరో కావ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాదిలో శ్రియ హీరోయిన్‌గా న‌టించిన ఈ రెండు బాల‌కృష్ణ చిత్రాల‌కు ప్ర‌త్యేక‌త‌లున్నాయి. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంతో బాల‌య్య వంద చిత్రాల మైలురాయికి చేరుకుంటే.. 101 వ చిత్ర‌మైన పైసా వ‌సూల్ కోసం త‌న కెరీర్‌లోనే మొద‌టిసారిగా పాట పాడాడు ఈ నందమూరి అంద‌గాడు. బాల‌య్య వందో చిత్రం హీరోయిన్ అనిపించుకున్నా.. బాల‌య్య పాడిన తొలి పాట‌లో అత‌ని ప‌క్క‌న స్టెప్స్ వేసిన నాయిక అనిపించుకున్నా.. అది శ్రియ‌కే చెల్లింది.

More News

మహేష్ హీరోయిన్ మొత్తానికి హిట్ కొట్టింది

తొలి చిత్ర మే సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది కృతి సనన్.

లావణ్య ఎదరుచూపులు పలిస్తాయా?

అందాల రాక్షసి చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి

సంవత్సరానికో నందమూరి వారి సినిమా..

సరిగ్గా పదేళ్ల క్రితం ఒకే సంవత్సరంలో ఇద్దరు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలతో

తేజ హీరోగా హరి దర్శకత్వంలో బెక్కెం గోపి చిత్రం

'చూడాలని ఉంది','ఇంద్ర','యువరాజు' తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో

బాలయ్య కోసం నయన వచ్చేసింది

లేడీ సూపర్ స్టార్ గా తమిళనాట రాణిస్తోన్న నయనతార..