ద‌ర్శ‌కుడు తేజ‌కు స్పెష‌ల్ డే

  • IndiaGlitz, [Saturday,June 16 2018]

కొత్త తార‌ల‌తో సినిమాలు రూపొందించి సంచ‌ల‌న విజ‌యాలు అందుకునే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ మందే ఉంటారు. వారిలో ద‌ర్శ‌కుడు తేజ ఒక‌రు. 'చిత్రం', 'జ‌యం' చిత్రాల‌తో.. నూత‌న న‌టీన‌టుల‌తోనూ ఘ‌న‌విజ‌యాలు అందుకోవ‌చ్చ‌ని నిరూపించి తెలుగులో ఓ కొత్త ఒర‌వ‌డిని తీసుకువ‌చ్చిన తేజ‌.. ఈ రెండు చిత్రాల మ‌ధ్య‌లో 'నువ్వు నేను' సినిమా రూపొందించి సంచ‌ల‌న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

జ‌యం త‌రువాత 15 ఏళ్ళ పాటు స‌రైన విజ‌యం లేక‌పోయినా.. గ‌తేడాది విడుద‌లైన 'నేనే రాజు నేనే మంత్రి' మంచి విజ‌యం సాధించ‌డంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు తేజ‌. ప్ర‌స్తుతం కొత్త తార‌ల‌తోనే మ‌రో చిత్రం చేయ‌డానికి ఆయన స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఛాయాగ్రాహ‌కుడిగా కెరీర్‌ను ఆరంభించి ద‌ర్శ‌కుడిగా మారిన తేజ‌కు ఈ రోజు (జూన్ 16) ఎంతో స్పెష‌ల్‌. ఎందుకంటే.. ఆయ‌న తొలి సినిమా 'చిత్రం' విడుద‌లై నేటితో 18 ఏళ్ళు పూర్త‌య్యింది. మున్ముందు కూడా ఆయ‌న ప్ర‌యాణం స‌క్సెస్‌ఫుల్‌గా కొన‌సాగాల‌ని ఆశిద్దాం.

More News

ర‌జనీకాంత్ జోడీగా కాజ‌ల్‌?

తెలుగులోని ఈ త‌రం అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ ఆడిపాడిన క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

ఈ నెల 21న 'ఆయుష్మాన్ భవ' టీజర్ విడుదల

చ‌ర‌ణ్ తేజ్ హీరోగా త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నేను లోక‌ల్ చిత్ర ద‌ర్శ‌కుడు త్రినాథ్ రావు న‌క్కిన స్టోరి, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో

ఒక రోజు గ్యాప్‌లో రెండు చిత్రాలు

మెలోడీ సాంగ్స్‌తో తెలుగుసినీ సంగీత ప్రియుల‌ను అల‌రించిన మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్‌. 'మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రాని రోజు' టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన గోపీ సుంద‌ర్‌..

ర‌జ‌నీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా?

ఆరు ప‌దులు దాటినా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌లో ఎనర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. యువ క‌థానాయ‌కుల‌తో పోటీప‌డుతూ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయ‌న‌.

కిడ్నప్ డ్రామా నేపథ్యంలో శీను వేణు ప్రారంభం

అభిషేక్ కన్నెలూరు, మధుప్రియ, ప్రజ్వల్ , మమతా శ్రీ హీరో హీరోయిన్లుగా రవి ములకలపల్లి స్వీయ దర్శకత్వంలో వసుందర క్రియేషన్స్ పతాకంపై తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం 'శీను వేణు'.