close
Choose your channels

మోదీని కలవడం నాకు దక్కిన గౌరవం!

Monday, October 21, 2019 • తెలుగు Comments

మోదీని కలవడం నాకు దక్కిన గౌరవం!

భారత ప్రధాని నరేంద్ర మోదీని టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కలిశారు. కాగా.. ‘చేంజ్ విత్ ఇన్’ పేరిట సినీ తారలకు ఆతిథ్యం ఇచ్చిన విషయం విదితమే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలే హాజరుకావడం.. సౌత్ నుంచి ఎవరికీ పిలుపురాకపోవడంతో పెద్ద రచ్చే రచ్చే జరుగుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరు కోడలు, రామ్‌ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, ప్రముఖ నటి ఖుష్బూల సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే.. ఈ వ్యవహారంపై తాజాగా దిల్ రాజు స్పందించారు. కాగా ఈ కార్యక్రమానికి దిల్ రాజు కూడా హాజరైన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ ఫొటోను కూడా దిల్ రాజు పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో మోదీకి.. దిల్‌రాజు షేక్ హ్యాండిచ్చినట్లు ఉంది.

నాకు దక్కిన గౌరవం!

‘ప్రధాని నరేంద్ర మోదీని కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని ‘చేంజ్ విత్ ఇన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేం సినిమా రంగం గురించి చర్చించాము. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే శక్తి సినిమా రంగానికి ఉంది. ఈ విషయాన్నే ప్రధానికి నిశితంగా వివరించాము’ అని దిల్‌రాజు ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz