కాజ‌ల్‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి

  • IndiaGlitz, [Sunday,June 17 2018]

‘చందమామ’ సినిమాతో కాజల్ అగర్వాల్‌కు తొలి విజయాన్ని అందించారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. 2007లో వచ్చిన ఆ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారాయ‌న‌. ఆ త‌రువాత ఏడేళ్ళకు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా కోసం ఈ ఇద్ద‌రు మ‌రోసారి క‌లిసి ప‌నిచేశారు. ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

క‌ట్ చేస్తే.. నాలుగేళ్ళ విరామం త‌రువాత ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా రాబోతోంద‌ని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. గ్రామీణ నేప‌థ్యంలో అంతా కొత్త‌వారితో కృష్ణవంశీ ఓ లవ్ స్టొరీని తెరకెక్కించ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇందులో ఓ కీల‌క పాత్ర కోసం కాజ‌ల్‌ను సంప్ర‌దించార‌ట కృష్ణ‌వంశీ. త‌న‌కు బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కావ‌డంతో.. కాజ‌ల్ కూడా ఈ క్యారెక్ట‌ర్ చేసేందుకు అంగీకారం తెలిపింద‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.