ర‌ష్మిక ఇంటిపై ఐటీ సోదాలు

  • IndiaGlitz, [Thursday,January 16 2020]

ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయిక‌గా టాలీవుడ్‌లో రాణిస్తున్న క‌న్న‌డ క‌థానాయ‌కి ర‌ష్మిక మంద‌న్న‌. ఈ సంక్రాంతికి స‌రిలేరు నీకెవ్వ‌రుతో మ‌రో సూప‌ర్‌హిట్ చిత్రాన్నిన త‌న ఖాతాలో వేసుకుంది. ఈ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్న త‌రుణంలోనే ఆమెకు ఐటీ దాడుల రూపంలో షాక్ త‌గిలింది. క‌ర్ణాట‌క కూర్గ్‌లోని ర‌ష్మిక మంద‌న్న ఇంటిపై గురువారం ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్ర‌స్తుతం అగ్ర క‌థానాయ‌కులు స‌ర‌స‌న న‌టిస్తోన్న అ అమ్మ‌డుకి మంచి రెమ్యున‌రేషనే ద‌క్కుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ర‌ష్మిక మంద‌న్న‌.. ఆమె కుటుంబ స‌భ్యులెవ‌రూ దీనిపై స్పందించ‌లేదు.

క‌న్న‌డలో కిరిక్ పార్టీతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. త‌ర్వాత ఈమె తెలుగులో 'ఛలో' ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజ‌యం సాధించ‌డంతో పాటు ర‌ష్మిక అందం, అభినయం ఆక‌ట్టుకోవ‌డంతో ఆమెను త‌మ సినిమాలో హీరోయిన్‌గా న‌టింప చేయాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించారు. అదే స‌మ‌యంలో విడుద‌లైన గీత గోవిందంలో ర‌ష్మిక న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో మ‌హేశ్ సినిమా 'స‌రిలేరు నీకెవ్వ‌రు'లో అవకాశాన్ని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం బ‌న్నీ, సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో కార్తి స‌ర‌స‌న న‌టిస్తోంది.